ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆంధ్రజ్యోతి’ విలేకరి అంజద్ బాషాపై దాడిని ఖండించిన లోకేష్

ABN, First Publish Date - 2020-10-04T02:11:25+05:30

నెల్లూరు జిల్లా వెంకటాచలంలో ‘ఆంధ్రజ్యోతి’ విలేకరి అంజద్ బాషాపై వైసీపీ నేతల దాడిని తీవ్రంగా ఖండిస్తున్నానని టీడీపీ నేత నారా లోకేష్ ప్రకటించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: నెల్లూరు జిల్లా వెంకటాచలంలో ‘ఆంధ్రజ్యోతి’ విలేకరి అంజద్ బాషాపై వైసీపీ నేతల దాడిని తీవ్రంగా ఖండిస్తున్నానని టీడీపీ నేత నారా లోకేష్ ప్రకటించారు. దాడి చేసిన వైసీపీ నేతల్ని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. పత్రికాస్వేచ్ఛని హరించే విధంగా జగన్ రెడ్డి జీవో 2430 తీసుకొస్తే.. వైసీపీ నేతలు పాత్రికేయులే ఉండకూడదంటూ దాడులు చేస్తున్నారని లోకేష్‌ ధ్వజమెత్తారు. ‘ఆంధ్రజ్యోతి’ విలేకరిర్ అంజాద్ బాషాపై వైసీపీ నాయకుల అనుచరులు దాడిని మాజీమంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి తీవ్రంగా ఖండించారు. జిల్లా ఎస్పీ ఈ ఘటనపై విచారణ జరిపి దోషులను శిక్షించడం ద్వారా పత్రికా స్వేచ్ఛను కాపాడాలని సోమిరెడ్డి పిలుపునిచ్చారు.


నెల్లూరు జిల్లాలోని వెంకటాచలంలో ‘ఆంధ్రజ్యోతి’ విలేకరి అంజాద్ బాషాపై వైసీపీ కార్యకర్తల దాడి చేసిన విషయం విదితమే. ఈ ఘటనలో విలేకరికి తీవ్రగాయాలవ్వడంతో హుటాహుటిన స్థానికంగా ఉన్న ఆసుపత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు. ఈ ఘటనపై పలువురు ప్రముఖులు, ప్రజా సంఘాల నేతలు స్పందిస్తూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Updated Date - 2020-10-04T02:11:25+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising