ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సీఎం స్వగ్రామంలోనే మహిళలకు రక్షణ లేదు: లోకేశ్‌

ABN, First Publish Date - 2020-12-10T09:03:52+05:30

ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి సొంత ఊరిలోనే మహిళలకు రక్షణ కొరవడిందని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ ఆరోపించారు. ‘‘పులివెందుల నియోజకవర్గం పెద్దకుడాల గ్రామంలో దళిత మహిళ నాగమ్మ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి, డిసెంబరు 9(ఆంధ్రజ్యోతి): ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి సొంత ఊరిలోనే మహిళలకు రక్షణ కొరవడిందని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌  ఆరోపించారు. ‘‘పులివెందుల నియోజకవర్గం పెద్దకుడాల గ్రామంలో దళిత మహిళ నాగమ్మ హత్యాచారానికి గురైంది. ఈ విషయం బయటకు రాకుండా చేయడానికి ప్రభుత్వం పెడుతున్న శ్రద్ధ మహిళలకు రక్షణ కల్పించడంలో పెట్టాలి. ఈ ఘటనపై త్వరితగతిన విచారణ జరిపి నిందితులను శిక్షించాలి. మహిళలపై అఘాయిత్యాలు జరుగుతున్నా ప్రభుత్వంలో చలనం లేదు. చట్టాల పేరు చెప్తూ కాలయాపన తప్ప మృగాళ్లను శిక్షించింది లేదు. మహిళలపై వరుసగా జరుగుతున్న అత్యాచారాలు ఆందోళనకు గురిచేస్తున్నాయి’’అని లోకేశ్‌ ట్వీట్‌ చేశారు. 

Updated Date - 2020-12-10T09:03:52+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising