ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఏపీలో లాక్‌డౌన్ నిబంధనల ఉల్లంఘన

ABN, First Publish Date - 2020-04-09T23:24:01+05:30

ఏపీలో లాక్‌డౌన్ నిబంధనల ఉల్లంఘన

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విశాఖ: నగరంలో లాక్‌డౌన్ ఆంక్షలను కొందరు ఉల్లంఘిస్తున్నారు. దీంతో పోలీసులు అప్రమత్తమవుతున్నారు. నిబంధనలు ఉల్లంఘిస్తున్న వారిపై కేసులు నమోదు చేస్తున్నారు. అంతేకాదు వాహనాల సీజ్‌తో పాటు భారీగా ఫైన్‌లు విధిస్తున్నారు. ఇకపై నిబంధనలు మరింత కఠినంగా అమలు చేస్తామని పోలీసులు చెబుతున్నారు. ప్రభుత్వం విధించిన లాక్‌డౌన్‌ ఆంక్షలు ప్రజల క్షేమం కోసమేనని, అందరూ రోడ్లపైకి రాకుండా స్వీయ నియంత్రణ పాటించాలని పోలీసులు సూచిస్తున్నారు. ఎవరో ఒకరు చేసిన పొరపాటుకు అందరికీ కరోనా వ్యాపించే అవకాశం ఉందన్నారు. కొంతమంది యువకులు అకారణంగా రోడ్లపై తిరుగుతున్నట్లు గమనించామని, వారు బయటకు రాకుండా కుటుంబ సభ్యులు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.


విజయవాడలోనూ ఇదే పరిస్థితి కనిపిస్తోంది. లాక్‌డౌన్‌ అమల్లోకి వచ్చి 16 రోజులు పూర్తయ్యింది. మరో వారంపాటు మరింత కచ్చితంగా లాక్‌డౌన్‌ను పాటిస్తే పరిస్థితిలో చాలా వరకు మార్పు రావొచ్చు. ఇదీ అధికారుల అభిప్రాయం. కానీ నగరంలో కొద్దిరోజులుగా పరిస్థితి చూస్తుంటే మాత్రం లాక్‌డౌన్‌ కట్టు తప్పినట్టుగా కనిపిస్తోంది. ఇప్పటి వరకు వాహనాలపై బయటకు వచ్చిన వారిని పోలీసులు ఎక్కడికక్కడ కట్టడి చేశారు. రహదారులపైకి అకారణంగా వచ్చిన వారికి పోలీసులు చుక్కలు చూపిస్తున్నారు. నగరంలో ఏర్పాటు చేసిన అన్ని చెక్‌పోస్టుల వద్ద పోలీసులు కఠినంగా వ్యవహరిస్తున్నారు. సహేతుకమైన కారణాలతో బయటకు వచ్చిన వారిని మాత్రమే వదిలిపెడుతున్నారు.

Updated Date - 2020-04-09T23:24:01+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising