ఆచార్య ఎన్‌జీ రంగా సాహిత్య పురస్కారాలు
ABN, First Publish Date - 2020-08-22T09:35:30+05:30
ఆచార్య ఎన్‌జీ రంగా సాహిత్య పురస్కారాల పేరిట ప్రతియేటా నిర్వహిస్తున్న కథల పోటీ ఫలితాలను నిర్వాహకులు డాక్టర్ జక్కంపూడి సీతారామారావు..
విజయవాడ, ఆగస్టు 21: ఆచార్య ఎన్‌జీ రంగా సాహిత్య పురస్కారాల పేరిట ప్రతియేటా నిర్వహిస్తున్న కథల పోటీ ఫలితాలను నిర్వాహకులు డాక్టర్ జక్కంపూడి సీతారామారావు, డాక్టర్ నాగభైరవ ఆదినారాయణ తదితరులు శుక్రవారం వెల్లడించారు. ప్రథమ బహుమతిగా కాకినాడకు చెందిన ఎం.ఉండవల్లి రాసిన ‘పిచ్చుకలూరు’ను న్యాయ నిర్ణేతలు ఎంపికచేశారని తెలిపారు. అలాగే జె.సుబ్బారావు (నూజివీడు)రాసిన ‘తడియారని బ్రతుకులు’, మీనాక్షి శ్రీనివాస్ (కాకినాడ) రాసిన ‘కనురెప్పలు’, దాసరి శివకుమారి (తెనాలి) రాసిన ‘అనుబంధాలు’, ఎ.నాగజ్యోతి (బెంగుళూరు) రాసిన ‘మాయజలతారు’ ద్వితీయ బహుమతికి ఎంపికయ్యాయన్నారు. పిన్ని వెంకటేశ్వర్లు (కొత్తపట్నం) రాసిన వరద గోదావరి, చిలకమర్తి పద్మజ (ఒంగోలు) రాసిన భస్మాసుర కథలు కన్సోలేషన్ బహుమతి(రూ.వెయ్యి)కి ఎంపికయినట్టు తెలిపారు.
Updated Date - 2020-08-22T09:35:30+05:30 IST