ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

తిరుమలలో ట్రాఫిక్‌ను తగ్గించేందుకు లైట్ మెట్రో!

ABN, First Publish Date - 2020-02-15T02:06:14+05:30

తిరుపతి నుంచి తిరుమల మార్గంలో రద్దీ తగ్గించడానికి లైట్ మెట్రో వాహన విధానం బావుంటుందని ..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తిరుమల : తిరుపతి నుంచి తిరుమల మార్గంలో రద్దీ తగ్గించడానికి లైట్ మెట్రో వాహన విధానం బావుంటుందని హైదరాబాద్ మెట్రో రైల్వే ఎండీ ఎన్వీఎస్ రెడ్డి తమ అభిప్రాయాన్ని వెలిబుచ్చారు. శుక్రవారం నాడు శ్రీ పద్మావతీ అతిథి గృహంలో టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. తిరుపతి, తిరుమలలో ట్రాఫిక్‌ను తగ్గించేందుకు చేపట్టాల్సిన అంశాల గురించి చర్చించారు.


తిరుపతి రైల్వే స్టేషన్, బస్టాండ్ నుంచి శ్రీవారి మెట్ల మార్గం ద్వారా రవాణా మెరుగు పరిచేందుకు తీసుకోవాల్సిన అంశాలు, అలాగే రేణిగుంట విమానాశ్రయం నుంచి తిరుపతి వరకు సుందరీకరణ గురించి చర్చించారు. భవిష్యత్తులో తిరుపతి, తిరుమలను అంతర్జాతీయ స్థాయి ఆధ్యాత్మిక దివ్యకేంద్రాలుగా తీర్చి దిద్దడానికి టీటీడీ అధికారులతో కలిసి పూర్తిస్థాయి నివేదిక తయారు చేయాలని సుబ్బారెడ్డి సూచించారని టీటీడీ పీఆర్వో ఓ ప్రకటనను విడుదల చేశారు.

Updated Date - 2020-02-15T02:06:14+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising