ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నేతలు భౌతికదూరం పాటించాల్సిందే: హైకోర్టు

ABN, First Publish Date - 2020-04-08T10:07:06+05:30

కరోనా వ్యాప్తి నియంత్రణ కోసం రాజకీయ నేతలు కూడా భౌతికదూరం పాటించాల్సిందేనని, లాక్‌డౌన్‌ నిబంధనలకు లోబడి నడచుకోవాల్సిందేనని ..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కరోనా వ్యాప్తి నియంత్రణ కోసం రాజకీయ నేతలు కూడా భౌతికదూరం పాటించాల్సిందేనని, లాక్‌డౌన్‌ నిబంధనలకు లోబడి నడచుకోవాల్సిందేనని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ జేకే మహేశ్వరి, న్యాయమూర్తి జస్టిస్‌ ఎం.సత్యనారాయణమూర్తితో కూడిన ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది. లాక్‌డౌన్‌ సందర్భంగా సహాయ చర్యలను సమీక్షించేందుకు మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు, ఎంపీ సత్యవతి, ఎమ్మెల్యే ధర్మశ్రీ మార్చి 30న చోడవరంలో అధికారులతో సమావేశం నిర్వహించారని, ఈ సందర్భంగా వారెవరూ భౌతిక దూరం పాటించలేదని వివరిస్తూ న్యాయవాది జి.లక్ష్మీనారాయణ ప్రధాన న్యాయమూర్తికి లేఖ రాశారు. లేఖపై ధర్మాసనం మంగళవారం విచారణ జరిపింది. ప్రస్తుత గడ్డు పరిస్థితుల్లో అలాంటి సమావేశాలు నిర్వహించకపోవడమే మేలని అభిప్రాయపడింది.

Updated Date - 2020-04-08T10:07:06+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising