ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

హైదరాబాద్ నుంచి ఏపీకి భారీగా వాహనాలు

ABN, First Publish Date - 2020-07-01T15:05:06+05:30

అమరావతి: హైదరాబాద్ నుంచి ఏపీకి భారీగా వాహనాలు వస్తున్నాయి. హైదరాబాద్‌లో లాక్‌డౌన్ విధిస్తారని తెలియడంతో పాటు...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: హైదరాబాద్ నుంచి ఏపీకి భారీగా వాహనాలు వస్తున్నాయి. హైదరాబాద్‌లో లాక్‌డౌన్ విధిస్తారని తెలియడంతో పాటు... వైరస్ ఎక్కువగా ఉండటంతో ఏపీవాసులంతా తమ స్వరాష్ట్రానికి చేరుకుంటున్నారు. విజయవాడ - హైదరాబాద్ జాతీయ రహదారిపై గరికపాడు చెక్ పోస్టు వద్దకు భారీగా వాహనాలు చేరుకున్నాయి. స్పందన యాప్ ద్వారా రిజిస్ట్రేషన్ చేయించుకొని ఏపీ వాసులు వస్తున్నారు. ఎటువంటి రిజిస్ట్రేషన్, పాస్ లేకుండా వస్తున్న వారిని పోలీసులు అనుమతించడం లేదు. హైదరాబాదులో కరోనా ఎక్కువగా ఉందని, లాక్‌డౌన్ పెట్టబోతున్నారని అందుకే వస్తున్నామని వాహనదారులు చెబుతున్నారు. తమని ఏపీలోకి అనుమతించాలని పోలీసులను ప్రాథేయ పడుతున్నారు. పాసు లేకుండా అనుమతించబోమని పోలీసు ఉన్నతాధికారులు స్పష్టం చేశారు. 


ఉదయం 7 గంటల నుంచి రాత్రి ఏడు గంటల వరకే అనుమతిస్తామని ఇప్పటికే ఏపీ పోలీస్ యంత్రాంగం స్పష్టం చేసింది.

Updated Date - 2020-07-01T15:05:06+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising