ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

విశాఖలో ల్యాండ్ పూలింగ్ పేరుతో భూముల సేకరణ

ABN, First Publish Date - 2020-06-05T18:46:00+05:30

ఏపీ ప్రభుత్వం జులై 8 నుంచి పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీకి సిద్ధమవుతోంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విశాఖ: ఏపీ ప్రభుత్వం జులై 8 నుంచి పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీకి సిద్ధమవుతోంది. అన్ని చోట్ల ఇళ్ల పట్టాల కోసం భూములు సేకరిస్తే విశాఖలో మాత్రం ల్యాండ్ పూలింగ్ పేరుతో భూములు సేకరించారు. అందులో ప్రభుత్వ భూములతోపాటుగా పేదలు, దళితులకు చెందిన భూములను ఎక్కవగా తీసుకున్నారు. నవరత్నాలలో భాగంగా అందరికీ ఇళ్ల పట్టాలు ఇవ్వాలని ప్రభుత్వం సంకల్పించింది. విశాఖ నగర పరిధిలో సుమారు లక్షా 25వేల మంది అర్హులు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. మిగిలినచోట్ల ప్రభుత్వ భూములు, పేదలకు, దళితులకు ఇచ్చిన భూములను నేరుగా లాక్కుంటే.. విశాఖలో మాత్రం ల్యాండ్ పూలింగ్ పేరుతో భూములు లాక్కుంది. ఇంతలో జీవీఎంసీ, స్థానిక ఎన్నికలు రావడంతో ఈ ప్రక్రియ నిలిచింది. తర్వాత కరోనా దెబ్బకు మొత్తం ఆగిపోయింది. ఇప్పుడు ప్రభుత్వం మళ్లీ భూములవైపు చూడ్డంతో ప్రజల్లో భయం మొదలైంది.


Updated Date - 2020-06-05T18:46:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising