అటవీశాఖ మహిళా ఉద్యోగిపై దాడి
ABN, First Publish Date - 2020-12-29T05:52:09+05:30
నాగలూటి రేంజ్ పరిధిలో ఎఫ్‌బీవోగా పనిచేస్తున్న మహిళా ఉద్యోగినిపై నాగలూటి చెంచు గూడేనికి చెందిన కొందరు దాడి చేశారు.
ఆత్మకూరు, డిసెంబరు 28: నాగలూటి రేంజ్ పరిధిలో ఎఫ్‌బీవోగా పనిచేస్తున్న మహిళా ఉద్యోగినిపై నాగలూటి చెంచు గూడేనికి చెందిన కొందరు దాడి చేశారు. రేంజ్ అధికారి చంద్రశేఖర్ తెలిపిన వివరాల మేరకు.. నల్లమలలో నాటుసారా బట్టీలను ఇటీవల ఎక్సైజ్ అధికారులు ధ్వంసం చేశారు. అయితే ఎఫ్‌బీవో సమాచారం వల్లే ఎక్సైజ్ అధికారులు దాడిచేశారన్న ఉద్దేశంతో సోమవారం మధ్యాహ్నం ఆమెపై ముగ్గురు దాడికి పాల్పడ్డారు. అటవీ ఉద్యోగులు సోమవారం రాత్రి ఆత్మకూరు పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.
Updated Date - 2020-12-29T05:52:09+05:30 IST