చికిత్స పొందుతూ మహిళ మృతి
ABN, First Publish Date - 2020-11-13T06:00:14+05:30
పట్టణంలోని శ్మశాన వాటిక రహదారిలో నివాసం ఉంటున్న సత్యం భార్య అరుణ(30) చికిత్స పొందుతూ మృతి చెందింది.
ఆళ్లగడ్డ, నవంబరు 12: పట్టణంలోని శ్మశాన వాటిక రహదారిలో నివాసం ఉంటున్న సత్యం భార్య అరుణ(30) చికిత్స పొందుతూ మృతి చెందింది. ఈనెల 7న ఆమె వంటిపై పెట్రోలు పోసుకొని నిప్పంటించుకొని తీవ్రంగా గాయపడింది. ఆళ్లగడ్డ ప్రభుత్వ వైద్యశాలకు తరలించగా మెరుగైన వైద్యం కోసం కర్నూలు ప్రభుత్వ వైద్యశాలకు వైద్యులు తీసికెళ్లమని సూచించారు. అక్కడ చికిత్స పొందుతూ కొలుకొలేక మృతి చెందిందని ఎస్‌ఐ రామిరెడ్డి గురువారం తెలిపారు.
Updated Date - 2020-11-13T06:00:14+05:30 IST