వణికిస్తున్న చలి
ABN, First Publish Date - 2020-12-14T05:14:28+05:30
జిల్లా ప్రజలను చలి వణికిస్తోంది.
- 31 డిగ్రీలుగా పగటి ఉష్ణోగ్రతలు
- 17 డిగ్రీలకు పడిపోతున్న కనిష్ఠ ఉష్ణోగ్రతలు
కర్నూలు(హాస్పిటల్), డిసెంబరు 13: జిల్లా ప్రజలను చలి వణికిస్తోంది. రోజురోజుకు చలిగాలుల తీవ్రత పెరుగుతోంది. ఆదివారం గరిష్ఠంగా 31.5 డిగ్రీలు, 17.1 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రాత్రి వేళల్లో ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2 డిగ్రీలు పడిపోవడంతో చలి తీవ్రత అధికంగా ఉంటోంది. నాలుగు రోజులుగా పగటి ఉష్ణోగ్రతలు 31 డిగ్రీలు దాటడం లేదు. పగటి ఉష్ణోగ్రతలు తగ్గుతుండటంతో అటవి ప్రాంతంలో చలి తీవ్రత ఎక్కువగా ఉంటోంది. ఉదయం 9 గంటలైనా పొగ మంచు తొలగడం లేదు. ఉదయం పూట చలి తీవ్రత వల్ల వృద్ధులు, ఆస్తమా వ్యాధిగ్రస్తులు అవస్థలు పడుతున్నారు. తూర్పు, ఆగ్నేయం దిశ నుంచి గాలులు విస్తున్నాయని, రాబోయే రోజుల్లో ఉష్ణోగ్రతలు మరింత తగ్గే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. చలి తీవ్రత పెరుగుతుండటంతో కరోనా వైరస్ సోకే ప్రమాదం ఉందని వైద్యులు చెబుతున్నారు.
ఐదు రోజుల్లో నమోదైన ఉష్ణోగ్రతలు
తేదీ గరిష్ఠం కనిష్ఠం
9వ తేదీ 32.7 24.3
10వ తేదీ 32.5 17.6
11వ తేదీ 32.6 17.1
12వ తేదీ 31.1 17.2
13వ తేదీ 31.5 17.1
Updated Date - 2020-12-14T05:14:28+05:30 IST