ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పన్నుకు, పింఛన్‌కు లింకేంటి?

ABN, First Publish Date - 2020-12-05T05:38:30+05:30

ఇంటి పన్ను కడితేనే పింఛన్‌ అనే శీర్షికతో గురువారం ఆంధ్రజ్యోతిలో అచ్చయిన కథనానికి డీఎల్‌పీవో నూర్జహాన్‌ స్పందించారు.

విచారణ చేస్తున్న డీఎల్‌పీవో నూర్జహాన్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  1. పంచాయతీ అధికారులు, వలంటీర్లపై డీఎల్‌పీవో మండిపాటు
  2. కార్యదర్శికి వార్నింగ్‌
  3. ఆంద్రజోతి ఎఫెక్ట్‌


నందవరం, డిసెంబరు 4: ఇంటి పన్ను కడితేనే పింఛన్‌ అనే శీర్షికతో గురువారం ఆంధ్రజ్యోతిలో అచ్చయిన కథనానికి డీఎల్‌పీవో నూర్జహాన్‌ స్పందించారు. నందవ రానికి వచ్చి ఈవోఆర్డీ ఈశ్వర య్యస్వామి ఆధ్వర్యంలో లబ్ధిదా రులందరికీ పింఛన్లు ఇప్పించేలా చేశారు. పంచాయతీ కార్యదర్శి జయరాముడుతో మాట్లాడుతూ పింఛన్‌కు.. పన్ను వసూలుకు సంబంధం ఏమిటని ప్రశ్నించారు. నీపై చాలా ఫిర్యాదులు ఉన్నాయని, నిబంధనల మేరకు ఇంటి పన్ను వసూలు చేయాలని అన్నారు. ప్రజల నుంచి అధిక మొత్తంలో వసూలు చేస్తున్నట్లు తన విచారణలో తేలిందని, ఇలా అయితే చర్యలు తప్పవని ఆమె హెచ్చరించారు. ఇళ్ల పర్మిషన్‌, సర్టిఫికెట్ల కోసం కూడా డబ్బులు వసూళ్ల చేస్తున్నటు తన దృష్టికి వచ్చిందని అన్నారు. ప్రమోషన్‌లో ఉన్నావు.. మరోసారి ఇలాంటి తప్పులు చేస్తే సహించేది లేదని హెచ్చరించారు. మరోసారి ఇలాంటి తప్పులు జరగకుండా చూసుకుంటామని పంచాయతీ అధికారి తెలిపారు. ఈ విచారణపై నివేదికను ఉన్నతాధికారులుకు పంపిస్తానని డీఎల్‌పీవో అన్నారు. 

Updated Date - 2020-12-05T05:38:30+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising