ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘ప్రభుత్వ పథకాలు వర్తింపజేయాలి’

ABN, First Publish Date - 2020-12-31T05:07:07+05:30

విద్యాశాఖ పరిధిలో ఉన్న ఏపీ మోడల్‌ స్కూల్‌, గర్ల్స్‌ హాస్టల్‌లో ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులకు ప్రభుత్వ పథకాలకు అనర్హులుగా చేయవద్దని మోడల్‌ స్కూల్స్‌ జాయింట్‌ డైరెక్టర్‌ మధుసూధన్‌ను కలిసి విన్నవించినట్లు ఏఐటీయూసీ రాష్ట్ర నాయకులు రమేష్‌, బాబు, లలితమ్మ బుధవారం తెలిపారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆలూరు, డిసెంబరు 30: విద్యాశాఖ పరిధిలో ఉన్న ఏపీ మోడల్‌ స్కూల్‌, గర్ల్స్‌ హాస్టల్‌లో ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులకు ప్రభుత్వ పథకాలకు అనర్హులుగా చేయవద్దని మోడల్‌ స్కూల్స్‌ జాయింట్‌ డైరెక్టర్‌ మధుసూధన్‌ను కలిసి విన్నవించినట్లు ఏఐటీయూసీ రాష్ట్ర నాయకులు రమేష్‌, బాబు, లలితమ్మ బుధవారం తెలిపారు. 13 వేలకు మించి వేతనంతో నెట్టుకొస్తున్న వీరికి అమ్మఒడి జాబితాలో ప్రభుత్వ ఉద్యోగిగా పరిగణిస్తూ అనర్హులుగా చేయడం సరికాదన్నారు. సమాన పనికి సమాన వేతనం అందించి పథకాలకు అనర్హులుగా చేయాలని కోరామన్నారు. ప్రభుత్వం ఈ విషయంపై మరోసారి పునరాలోచించి అమ్మఒడి వర్తింపజేయాలని డిమాండ్‌ చేశారు. 



దేవనకొండ: స్కీమ్‌వర్కర్లకు ప్రభుత్వ పథకాలు వర్తింపజేయాలని వ్యవసాయ కార్మికసంఘం జిల్లా ఉపాధ్యక్షుడు వీరశేఖర్‌, సీఐటీయూ మండల కార్యదర్శి అశోక్‌  డిమాండ్‌ చేశారు. బుధవారం స్థానిక తహసీల్దార్‌ కార్యాలయంలో సీఐటీయూ ఆధ్వర్యంలో స్కీం వర్కర్లతో ధర్నా నిర్వహించారు. అనంతరం జూనియర్‌ అసిస్టెంట్‌ నబిరసూల్‌కు వినతిపత్రాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో సీఐటీయు, అంగన్‌వాడీ వర్కర్ల యూనియన్‌ నాయకురాలు జ్యోతిలక్ష్మి, వెంకటలక్ష్మి, రంగమ్మ, విజయనిర్మల, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. 


నందవరం: అర్హులైన ఆశా, అంగన్‌వాడీ వర్కర్లకు ప్రభుత్వ సంక్షేమ పఽథకాలు అందేలా చూడాలని సీఐటీయూ డివిజన్‌ అధ్యక్షులు అంబేద్కర్‌ డిమాండ్‌ చేశారు. బుధవారం సీఐటీయూ ఆధ్వర్యంలో అంగన్‌వాడీ, ఆశావర్కర్లు తహసీల్దార్‌ కార్యాలయం ముందు ధర్నా చేశారు. అనంతరం వినతి పత్రాన్ని కార్యాలయంలోని జూనియర్‌ అసిస్టెంట్‌ కిషోర్‌కు అందజేశారు. కార్యక్రమంలో అంగన్‌వాడి మండల కార్యదర్శి పద్మ, గాయిత్రి, పుణ్యవతి, సురేఖ, శమంతకమణి, ఆశావర్కర్లు పాల్గొన్నారు.

Updated Date - 2020-12-31T05:07:07+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising