ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘గ్రంథాలయాలను వినియోగించుకోవాలి’

ABN, First Publish Date - 2020-12-07T05:17:49+05:30

విద్యార్థులు గ్రంథాలయాలను సద్వినియోగం చేసుకొని మంచి పుస్తకాలను చదవాలని గాడిచర్ల ఫౌండేషన్‌ రాష్ట్ర అధ్యక్షుడు కేసీ కల్కూర అన్నారు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కర్నూలు (కల్చరల్‌), డిసెంబరు 6: విద్యార్థులు గ్రంథాలయాలను సద్వినియోగం చేసుకొని  మంచి పుస్తకాలను చదవాలని  గాడిచర్ల ఫౌండేషన్‌ రాష్ట్ర అధ్యక్షుడు కేసీ కల్కూర అన్నారు. అక్షరాస్యత కార్యక్రమం అమలులో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ఏడాది పాటు ప్రవేశ పెట్టిన ‘చదవడం మాకిష్టం’ అనే కార్యక్రమాన్ని జిల్లా కేంద్ర గ్రంథాలయంలో ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థుల్లో పఠనాసక్తి పెంపొందేలా ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం హర్షదాయకమని అన్నారు. జిల్లా గ్రంథాలయ సంస్థ కార్యదర్శి సి. శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ జిల్లా కేంద్ర గ్రంథాలయం తోపాటు జిల్లాలోని 58 శాఖా గ్రంథాలయాలు, గ్రామీణ గ్రంథాలయాలు, 52 పుస్తక నిక్షిప్త కేంద్రాల్లో విద్యార్థుల కోసం ఈ కార్యక్రమాన్ని ప్రారంభించామని చెప్పారు.  ఈ కార్యక్రమంలో మండల విద్యాధికారులు అనంతయ్య, సుశీల, విశ్రాంత హెచ్‌ఎం గోవిందరావు, పాఠశాల ఉపాధ్యాయులు ఇనాయతుల్లా, ఏపీఓ వెంకటేశ్వర్లు, విద్యార్థులు, తల్లిదండ్రులు హాజరయ్యారు. 


ప్యాపిలి: చదువుతోనే విజ్ఞానం లభిస్తుందని సర్వశిక్షాభియాన్‌ జిల్లా అడిషనల్‌ ప్రాజెక్టు కో ఆర్డినేటర్‌ వేణుగోపాల్‌ అన్నారు. ఆదివారం మండలంలోని హుసేనాపురం, ప్యాపిలి గ్రంఽథాలయాల్లో ప్రభుత్వం నూతనంగా అమలు చేసిన చదవడం నాకిష్టం కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ఉప విద్యాధికారి నాగరాజు, న్యాయవాది నాగభూషణంరెడ్డి, ఎంఈవో శ్రీనివాసులు, లైబ్రేరియన్‌ గిరిబాబు, ఎమ్మార్సీ రామాంజినేయులు పాల్గొన్నారు. 


Updated Date - 2020-12-07T05:17:49+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising