నేడు వైద్యసేవలు బంద్
ABN, First Publish Date - 2020-12-11T05:43:51+05:30
కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వైద్య చట్టాలను ఉపసంహరించుకోవాలని కోరుతూ శుక్రవారం దేశ వ్యాప్తంగా వైద్యసేవల బంద్‌ను నిర్వహిస్తున్నట్లు ఐఎంఏ రాష్ట్ర నాయకుడు డాక్టర్ రవికృష్ణ తెలిపారు.
నంద్యాల (ఎడ్యుకేషన్), డిసెంబరు 10: కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వైద్య చట్టాలను ఉపసంహరించుకోవాలని కోరుతూ శుక్రవారం దేశ వ్యాప్తంగా వైద్యసేవల బంద్‌ను నిర్వహిస్తున్నట్లు ఐఎంఏ రాష్ట్ర నాయకుడు డాక్టర్ రవికృష్ణ తెలిపారు. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ జాతీయ స్థాయి పిలుపు మేరకు దేశ వ్యాప్త వైద్య సేవల బంద్‌లో భాగంగా నంద్యాలలో శుక్రవారం ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు అన్ని ప్రైవేటు ఆసుపత్రులలో అత్యవసర చికిత్స మినహా మిగిలిన వైద్య సేవలను బంద్ పెడుతున్నట్లు ఆయన తెలిపారు. ఐఎంఏ రాష్ట్ర కమిటీ సభ్యులు డాక్టర్ అనీల్‌కుమార్, డాక్టర్ విజయభాస్కర్‌రెడ్డి, డాక్టర్ మధుసూదన్‌రెడ్డి పాల్గొన్నారు.
Updated Date - 2020-12-11T05:43:51+05:30 IST