నేటి నుంచి నైట్‌రైడర్ సర్వీసు
ABN, First Publish Date - 2020-12-29T05:30:00+05:30
కర్నూలు నుంచి విజయవాడకు బుధవారం నుంచి నైట్‌రైడర్ సర్వీసును పునరుద్ధరిస్తున్నట్లు డిపో మేనేజర్ శ్రీనివాసులు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు.
కర్నూలు(రూరల్), డిసెంబర్ 29: కర్నూలు నుంచి విజయవాడకు బుధవారం నుంచి నైట్‌రైడర్ సర్వీసును పునరుద్ధరిస్తున్నట్లు డిపో మేనేజర్ శ్రీనివాసులు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈబస్సుల్లో 15 బెర్తులు, 33 సీట్లు ఉంటాయన్నారు. చెప్పారు. కర్నూలు నుంచి రాత్రి 10.30 గంటలకు బయలుదేరి విజయవాడకు ఉదయం 5.50 గంటలకు చేరుకుంటుందన్నారు. అక్కడి నుంచి తిరిగి 10 గంటలకు బయలుదేరి కర్నూలుకు ఉదయం 5.20 గంటలకు చేరుకుంటుందన్నారు. బెర్తులలో పెద్దలకు రూ. 860, పిల్లలకు రూ. 660 చార్జీ వసూలు చేస్తారన్నారు.
Updated Date - 2020-12-29T05:30:00+05:30 IST