ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నేటి నుంచి తరగతులు

ABN, First Publish Date - 2020-12-14T05:17:46+05:30

అన్ని యజమాన్యాల పాఠశా లల్లో 2020-2021 విద్యాసంవత్సరానికి సంబంధించి 7వ తరగతులు సోమవారం నుంచి పునఃప్రారంభం కానున్నట్లు డీఈవో సాయిరాం ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కర్నూలు(ఎడ్యుకేషన్‌), డిసెంబరు 13: అన్ని యజమాన్యాల పాఠశా లల్లో 2020-2021 విద్యాసంవత్సరానికి సంబంధించి 7వ తరగతులు సోమవారం నుంచి పునఃప్రారంభం కానున్నట్లు డీఈవో సాయిరాం ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. 7వ తరగతి విద్యార్థులు సోమ, బుధ, శుక్రవారాలలో, 8వ తరగతి విద్యార్థులు మంగళ, గురు, శనివారాలలో పాఠశాలలకు హాజరు కావాలన్నారు. 9, 10 తరగతుల విద్యార్థులు ప్రతిరోజూ పాఠశాలలకు హాజరవ్వాలని డీఈవో తెలిపారు. ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 1.30 గంటల వరకు తరగతులు నిర్వహించాలన్నారు. పాఠశాలలో తరగతుల నిర్వహణకు తగినన్ని గదులు సదుపాయం ఉండి.. విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉన్న పాఠశాలలో 7, 8, 9, 10 తరగతులను ప్రతి రోజూ నిర్వహించవచ్చునన్నారు. కొవిడ్‌-19 నియంత్రణకు ఇచ్చిన మార్గదర్శకాలను తప్పక అమలు చేస్తూ ప్రభుత్వ ఆదేశాలను ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, సిబ్బంది సమయపాలన పాటించేటట్లు విద్యాశాఖ అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. 6వ తరగతి విద్యార్థులకు పాఠశాల పునఃప్రారంభంపై తర్వాత తెలియజేస్తామని డీఈవో తెలిపారు. 

Updated Date - 2020-12-14T05:17:46+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising