తిరుపతికి బయలుదేరిన పీఠాధిపతి
ABN, First Publish Date - 2020-03-16T11:04:41+05:30
తిరుపతికి బయలుదేరిన పీఠాధిపతి
ఆళ్లగడ్డ, మార్చి 15: అహోబిలం పీఠాధిపతి రంగనాథ యతీంద్ర మహాదేశికన్ తన శిష్యబృందంతో తిరుపతికి ఆదివారం బయలుదేరి వెళ్లారు. ఈ సందర్భంగా అహోబిలం వేదపండితులు ఘనంగా వీడ్కోలు పలికారు. పీఠాధిపతి అహోబిలం బ్రహోత్సవాలను పురస్కరించుకొని గత నెల 27వ తేదిన తన శిష్యబృందంతో అహోబిలం చేరుకున్నారు. బ్రహ్మోత్సవాలలో పాల్గొని విజయవంతం చేశారు. బ్రహ్మోత్సవాలు ఈనెల 10వ తేదిన ముగిశాయి. దీంతో ఆయన తిరుమల వెంకటేశ్వరస్వామిని దర్శించుకొని అక్కడి నుంచి తమిళనాడు శ్రీరంగపట్నం చేరుకుంటారని అహోబిలం వేదపండితులు తెలిపారు.
Updated Date - 2020-03-16T11:04:41+05:30 IST