ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కంటైన్మెంట్‌ జోన్లలో కఠినతరం

ABN, First Publish Date - 2020-06-06T09:24:56+05:30

కంటైన్మెంట్‌ ప్రాంతాల్లో లాక్‌డౌన్‌ నిబంధనలను కఠినంగా అమలు చేస్తామని కలెక్టర్‌ జి.వీరపాండియన్‌

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

లాక్‌డౌన్‌ నిబంధనలు తప్పనిసరి

నాన్‌ కంటైన్మెంట్లలో దుకాణాలు తెరుచుకోవచ్చు

భౌతిక దూరం పాటించని షాపులను మూసేస్తాం

కలెక్టర్‌ జి.వీరపాండియన్‌


కర్నూలు, జూన్‌ 05(ఆంధ్రజ్యోతి): కంటైన్మెంట్‌ ప్రాంతాల్లో లాక్‌డౌన్‌ నిబంధనలను కఠినంగా అమలు చేస్తామని కలెక్టర్‌ జి.వీరపాండియన్‌ అన్నారు. శుక్రవారం ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. మూడు రోజులుగా నగరంలో వివిధ ప్రాంతాలను పరిశీలిస్తున్నానని, దుకాణాల వద్ద భౌతిక దూరం పాటించడం లేదని అన్నారు. లాక్‌డౌన్‌ 5.0 నిబంధనల ప్రకారం మాస్కులు ధరించాలని, ఆరు అడుగుల దూరం పాటించాలని, హ్యాండ్‌ శానిటైజర్‌ ఏర్పాటు చేయాలని అన్నారు. వీటిని నిర్లక్ష్యం చేసే దుకాణదారులపై సెక్షన్‌ 188 కింద భారీ జరిమానా విధిస్తామని స్పష్టం చేశారు. అలాగే కంటైన్మెంట్‌ జోన్లలో కేసులు పెరగకుండా లాక్‌డౌన్‌ను కఠినంగా అమలయ్యేలా చూడాలని పోలీసు, రెవెన్యూ, మున్సిపల్‌, మండల స్థాయి అధికారులను కలెక్టర్‌ ఆదేశించారు. నాన్‌ కంటైన్మెంట్‌ జోన్లుగా నోటిఫై చేసిన గ్రామాలు, పట్టణ వార్డుల్లో పాలు, పండ్లు, కూరగాయలు, తాగునీరు, కిరాణం, మందుల  దుకాణాలు మాత్రమే తెరుచుకోవచ్చన్నారు.


అయితే ఆరు అడుగుల భౌతిక దూరాన్ని కచ్చితంగా పాటించాలన్నారు. కరోనా వైరస్‌ ప్రబలకుండా ప్రజలు స్వీయ రక్షణ పాటించాలన్నారు. జిల్లాలో ఇప్పటి వరకు 739 కరోనా పాజిటివ్‌ కేసులు, 26 మరణాలు నమోదైనట్లు చెప్పారు. డిశ్చార్జి అయిన వారి సంఖ్య 70 శాతం పైనే ఉందని తెలిపారు. జూన్‌లో కేసుల సంఖ్య పెరగవచ్చని వైద్య అఽధికారులు తెలిపారన్నారు. పాజిటివ్‌ వస్తే ఐసొలేషన్‌లో చికిత్స పొందవచ్చని, వైద్యుల సలహా మేరకు హోమ్‌ ఐసొలేషన్‌లో ఉంటూ కూడా చికిత్స పొందవచ్చని కలెక్టర్‌ వీరపాండియన్‌ తెలిపారు. 

Updated Date - 2020-06-06T09:24:56+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising