ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రెండున్నర కేజీ రెండొందలు

ABN, First Publish Date - 2020-04-09T11:06:07+05:30

లాక్‌డౌన్‌ను అదనపుగా తీసుకుని నంద్యాలలో కూరగాయల ధరలు అమాంతం పెంచేశారు. ఐదు రకాల కూరగాయలు ఉన్న

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నంద్యాలలో కూరగాయల ధర ఇదీ

ఒక్కోరకం అర కిలో ప్రకారం ప్యాకింగ్‌


నంద్యాల టౌన్‌, ఏప్రిల్‌ 8: లాక్‌డౌన్‌ను అదనపుగా తీసుకుని నంద్యాలలో కూరగాయల ధరలు అమాంతం పెంచేశారు. ఐదు రకాల కూరగాయలు ఉన్న రెండున్నర కేజీల ఒక ప్యాకేజీని ఏకంగా రూ.200కు అమ్ముతున్నారు. పట్టణంలో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య పెరిగిన నేపథ్యంలో రెండు రోజుల పాటు కర్ఫ్యూ విధించారు. సమీప గ్రామాల ప్రజలను పట్టణంలోకి రానివ్వడం లేదు. మూలమఠం, రైతు నగరం, స్టేంట్‌ బ్యాంక్‌ కాలనీ తదితర ప్రాంతాలలో కూరగాయల దుకాణాలను ఏర్పాటు చేశారు.


ఇక్కడ దుకాణదారులు వివిధ రకాల కూరగాయలను ప్రత్యేకంగా ప్యాకింగ్‌ చేసి అమ్ముతున్నారు. మిర్చి, ఆలూ, టమోటా, ఉల్లి, వంకాయలు ఒక్కో రకం అర కిలో అందులో ఉంటున్నాయి. ఇలా మొత్తం రెండున్న కిలోల బరువున్న కూరగాయలను రూ.200 ఇచ్చి కొనాల్సి వస్తోందని జనం వాపోతున్నారు. విడిగా కొంటే కేజీ కూరగాయలకు కనీసం రూ.65 చెల్లించాల్సి వస్తోందని అంటున్నారు. అధికారులు ధరల పట్టికలను ఏర్పాటు చేసినా వ్యాపారులు పాటించడం లేదు. అధికారుల స్పందించి చర్యలు తీసుకోవాలని వినియోగదారులు కోరుతున్నారు. 


Updated Date - 2020-04-09T11:06:07+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising