ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రెండు ఇండ్లలో..

ABN, First Publish Date - 2020-12-28T04:55:40+05:30

వేర్వేరు ప్రాంతాల్లో రెండు ఇండ్లలో చోరీ జరిగింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నంద్యాల (నూనెపల్లె), డిసెంబరు 27: వేర్వేరు ప్రాంతాల్లో రెండు ఇండ్లలో  చోరీ జరిగింది. నంద్యాల తాలుకా అర్బన్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని పోలూరు గ్రామం ఎస్సీ కాలనీలో ఓ ఇంట్లో చోరీ జరిగింది. రామలింగం వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగించేవాడు. రెండు రోజుల క్రిందట ఇంటికి తాళం వేసి బండి ఆత్మకూరు మండలం కడమలకాల్వ గ్రామానికి వెళ్లారు. తిరిగి ఆదివారం ఇంటికి రాగానే ఇంటికి వేసిన తాళం పగలగొట్టి ఉండటంతో చోరీ జరిగిందని గుర్తించాడు. ఇంట్లోకి వెళ్ళి చూసేసరికి ఇంట్లో సామాన్లు చెల్లా చెదురుగా పడ్డాయి. వెంటనే తాలుకా పోలీసులకు సమాచారం అందించడంతో ఘటనా స్థలానికి పోలీసులు చేరుకున్నారు. రూ.20 వేల నగదు, 10 తులాల వెండి, అరతులం బంగారం చోరీకి గురైనట్లు బాధితుడు తెలిపారు. చోరీ జరిగిన తీరును పోలీసులు పరిశీలించారు. బాధితుడు రామలింగం ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ మురళీమోహన్‌రావు తెలిపారు.


మిడుతూరు: మండలంలోని తలముడిపి గ్రామంలో ఆదివారం చిట్మెమ్మ అనే మహిళ ఇట్లో చోరీ జరిగినట్లు ఎస్‌ఐ గోపీనాధ్‌ తెలిపారు. చిట్టెమ్మ ఆదివారం ఉదయం సొంత గ్రామంలో బంధువుల ఇంటికి వెల్లింది. సాయంత్రం చిట్టెమ్మ తిరిగి ఇంటికి రాగా గుర్తు తెలియని దుండగులు ఇంట్లో ఉన్న బీరువాను పగులగొట్టి అందులో ఉన్న అరవై వేల నగదును, రూ.13 వేలు విలువ చేసే వెండిని దొంగతనం చేసినట్లు తెలిపారు. చిట్టెమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ తెలిపారు.

Updated Date - 2020-12-28T04:55:40+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising