ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పారిశుధ్య కార్మికుల సేవలు అభినందనీయం

ABN, First Publish Date - 2020-04-04T10:09:12+05:30

రోనా వైరస్‌ నివారణలో పారిశుధ్య కార్మికులు చేస్తున్న సేవలు అభినందనీయమని శ్రీశైలం ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డి అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పాములపాడు(వెలుగోడు), ఏప్రిల్‌ 3: కరోనా వైరస్‌ నివారణలో పారిశుధ్య కార్మికులు చేస్తున్న సేవలు అభినందనీయమని శ్రీశైలం ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డి అన్నారు. శుక్రవారం పట్టణ శివారులోని జమ్మినగర్‌ కాలనీలో రేషన్‌ కోసం వస్తున్న ప్రజలకు కరోనా వైరస్‌ ప్రబలకుండా తీసుకుంటున్న జాగ్రత్తలను ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డి పరిశీలించారు. వెలుగోడు మేజర్‌ గ్రామ పంచాయతీ కార్యాలయ ఆవరణలో పారిశుధ్య కార్మికులకు నిత్యావసర కిట్లను పంపిణీ చేశారు.


ఈ సందర్భంగా శ్రీశైలం ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డి మాట్లాడుతూ ప్రజలం దరూ లాక్‌డౌన్‌కు సంపూర్ణంగా సహకరించాలని కోరారు. వెలుగోడు- వేంపెంట రహదారి మార్గంలోని ఆదర్శ పాఠశాలలో ఏర్పాటు చేసిన క్వారంటైన్‌ కేంద్రాన్ని ఆయన పరిశీలించి వసతులపై వైద్యులు వంశీకృష్ణ, తహసీల్దార్‌ వేణుగోపాల్‌, ఎంపీడీవో అమానుల్లాను అడిగి తెలుసుకున్నారు. అనంతరం రేగడగూడూరు గ్రామ ఎస్సీ కాలనీలో కరోనా వైరస్‌పై తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి కాలనీవాసులకు వివరించారు. వేల్పనూరులో గ్రామ సచివాలయ ఉద్యోగులతో సమావేశం నిర్వహించారు. ఎస్‌ఐ రాజారెడ్డి, నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్త శిల్పా భువనేశ్వరరెడ్డి, నాయకులు లాలం రమేష్‌, అమీర్‌అలీఖాన్‌, మండ్ల శంకరరెడ్డి, బళ్ళాని సత్యనారాయణ, ఇలియా్‌సఖాన్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2020-04-04T10:09:12+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising