ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

తాగునీటి సమస్యను పరిష్కరించాలి

ABN, First Publish Date - 2020-05-30T10:03:50+05:30

తాగునీటి సమస్యను పరిష్కరించాలని వివిధ పార్టీల నాయకులు, ప్రజలు శుక్రవారం ఆందోళన చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రాజకీయ నాయకులు, ప్రజల ఆందోళన


ఆదోని, మే 29: తాగునీటి సమస్యను పరిష్కరించాలని వివిధ పార్టీల నాయకులు, ప్రజలు శుక్రవారం ఆందోళన చేశారు. ఆదోని మండలంలోని బల్లేకల్లు గ్రామంలో తాగునీటి సమన్యను పరిష్కరించాలని డీవైఎ్‌ఫఐ నాయకుల ఆధ్వర్యంలో గ్రామ సచివాలయం ఎదుట గ్రామస్థులు ఖాళీ బిందెలతో నిరసన వ్యక్తం చేశారు. డీవైఎ్‌ఫఐ మండల కార్యదర్శి తాహెర్‌వలి, మండల నాయకుడు రామదాసు, గ్రామ కార్యదర్శి శ్రీకృష్ణ మాట్లాడారు. గ్రామంలో వడ్డేవీధి, ఈడిగ వీధిలలో తాగునీరు అందక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోవడవం లేదని వాపోయారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి గ్రామంలో అన్ని వీధులకు పైపులైన్లు వేయించి తాగునీరు అందించాలని కోరారు. సమ్మర్‌స్టోరేజీ ట్యాంక్‌ నుంచి వచ్చే తాగునీటిని శుద్ధి చేసి సరఫరా చేయడం లేదని ఆరోపించారు. అధికారులు దృష్టి సారించి శుద్ధి చేసిన తాగునీటిని సరఫరా చేయాలని కోరారు. నాయకులు రామాంజి, ప్రకాష్‌, లక్ష్మీరెడ్డి పాల్గొన్నారు. 


ఆస్పరి: తాగునీటి సమస్యను పరిష్కరించాలని ఎంపీడీవో కార్యాలయం వద్ద ఐనకల్‌ గ్రామస్థులు శుక్రవారం ధర్నా చేశారు. అనంతరం ఎంపీడీవో రాజేందప్రసాద్‌కు వినతి పత్రం ఇచ్చారు. ఎంపీడీవోతో మహిళలు వాగ్వాదానికి దిగారు. సీపీఎం జిల్లా కార్యవర్గ సభ్యుడు హనుమంతు, బీజేపీ యువమోర్చా నాయకుడు కరుణాకర్‌ అధికారుల పనితీరుపై ధ్వజమెత్తారు. నీటి సమస్యపై స్పందించి చర్యలు తీసుకుంటామని ఆర్‌డబ్ల్యూఎస్‌ ఏఈ నరేష్‌ హామీ ఇవ్వడంతో ధర్నా విరమించారు. నాయకులు ఎర్రిస్వామి, గోవిందు, గుర్రప్ప, రంగస్వామి, ఎర్రప్ప, సుదర్శన్‌ పాల్గొన్నారు. 

Updated Date - 2020-05-30T10:03:50+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising