ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

జనతా కర్ఫ్యూ సంపూర్ణం

ABN, First Publish Date - 2020-03-23T10:30:25+05:30

నగర ప్రజలంతా జనతా కర్ఫ్యూను ఆదివారం స్వచ్ఛందంగా పాటించారు. ఇళ్ల నుంచి జనం బయటకు రాలేదు. వాహనాలు తిరగలేదు. దీంతో రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నిర్మానుష్యంగా వీధులు

 నిలిచిన వాహనాల రాకపోకలు


కర్నూలు(ఆంధ్రజ్యోతి), మార్చి 22: నగర ప్రజలంతా జనతా కర్ఫ్యూను ఆదివారం స్వచ్ఛందంగా పాటించారు. ఇళ్ల నుంచి  జనం బయటకు రాలేదు. వాహనాలు తిరగలేదు. దీంతో రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారాయి. 


 కలెక్టర్‌ సంఘీభావం

కరోనా కట్టడికి అహర్నిశలు శ్రమిస్తున్న మెడికల్‌ డిపార్ట్‌మెంట్‌, పారిశుధ్య కార్మికులు, పోలీసు సిబ్బందికి కలెక్టర్‌ అభినందనలు తెలిపారు. ఆదివారం జనతా కర్ఫ్యూ సందర్భంగా సాయంత్రం 5 గంటలకు కలెక్టర్‌ ఆయన సతీమణి ఆండాల్‌తో కలిసి వారి ఇంటి ముందు నిలబడి చప్పట్లతో తమ సంఘీభావాన్ని తెలియజేశారు. 


మెడికల్‌ క్యాంపుల పరిశీలన

 జనతా కర్ఫ్యూలో భాగంగా ఆదివారం పంచలింగాల చెక్‌పోస్టులోని కరోనా తనిఖీ కేంద్రాలను, వైద్య శిబిరాలను కలెక్టర్‌ వీరపాండియన్‌ పరిశీలించారు. తెలంగాణ సరిహద్దు ప్రాంతాలు, బెంగళూరు, బళ్ళారి ప్రాంతాల నుంచి వచ్చి వెళ్లే వాహనాదారులను, ప్రయాణికులను తనిఖీ చేసి వైద్య చికిత్సలను నిర్వహించాలని కలెక్టర్‌ వైద్య సిబ్బందిని ఆదేశించారు. ఎస్పీ ఫకీరప్ప మాట్లాడుతూ పోలీస్‌, రెవెన్యూ, వైద్యాధికారుల ఆధ్వర్యంలో కరోనా నియంత్రణకు పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఇందులో భాగంగా హైదరాబాద్‌ నుంచి బెంగళూరు వెళ్లే వాహనాలను నిలిపివేశామన్నారు. డోన్‌, వెల్దుర్తి, నంద్యాల, పాణ్యం, పంచలింగాల, మంత్రాలయం తదిత ర ప్రాంతాల్లో చెక్‌ పోస్టులను ఏర్పాటు చేశా మన్నారు. జాయింట్‌ కలెక్టర్‌ రవి పాల్గొన్నారు.

Updated Date - 2020-03-23T10:30:25+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising