ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వరద బాధితులను ఆదుకోని ప్రభుత్వం

ABN, First Publish Date - 2020-09-19T10:09:07+05:30

వరద బాధితులను ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలమైందని బీజేపీ నాయకురాలు బైరెడ్డి శబరి ఆరోపించారు. గువ్వలకుంట్ల, శివపురం గ్రామాలలో చెరువులకు గండ్లు పడి గృహాలలోకి నీరు చేరడంతో నష్టపోయిన బాధిత కుటుంబాల

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వరద బాధితులను ఆదుకోని ప్రభుత్వం

బీజేపీ నాయకురాలు బైరెడ్డి శబరి 


కొత్తపల్లి, సెప్టెంబరు 18:   వరద బాధితులను ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలమైందని బీజేపీ నాయకురాలు బైరెడ్డి శబరి ఆరోపించారు. గువ్వలకుంట్ల, శివపురం గ్రామాలలో చెరువులకు గండ్లు పడి గృహాలలోకి నీరు చేరడంతో నష్టపోయిన బాధిత కుటుంబాలను శుక్రవారం పరామర్శించారు. అనంతరం గువ్వలకుంట్ల చర్చిలో తలదాచుకున్న బాధిత కుటుంబాలకు బైరెడ్డిశబరి నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు.


అనంతరం శివపురం వద్ద ఉప్పొంగి ప్రవహిస్తున్న ఎద్దులేరు వాగులో ట్రాక్టర్లో ప్రయాణించి గండిపడిన ఈర్ల చెరువును పరిశీలించారు. శబరి మాట్లాడుతూ వరదల్లో పంటలు నష్టపోయిన ప్రతి రైతుకు పరిహారం అందించాలని, ఇళ్లలోకి నీరు పోయి నిరాశ్రయులైన బాధిత కుటుంబాలను తక్షణమే ఆదుకోవాలని డిమాండ్‌ చేశారు. ప్రభుత్వం స్పందించక పోతే కలెక్టరేట్‌ వద్ద ధర్నా చేస్తామని హెచ్చరించారు. పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు చర్లా దామోదరరెడ్డి, నాయకులు శ్రీనివాసనాయుడు, బైరెడ్డి దినేష్‌ రెడ్డి, వెంకటేష్‌, రామచంద్రారెడ్డి, చింతమాను శ్రీనివాసులు, శంకర్‌గౌడ్‌, పుల్లయ్య గౌడ్‌ పాల్గొన్నారు.

Updated Date - 2020-09-19T10:09:07+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising