ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రాజ్యాంగాన్ని గౌరవించాలి

ABN, First Publish Date - 2020-05-30T10:00:56+05:30

ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి రాజ్యాంగాన్ని గౌరవించడం నేర్చుకోవాలని పీసీసీ అధ్యక్షుడు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ప్రత్యేక హోదాపై మాట తప్పిన జగన్‌

వలస కూలీలను ఆదుకోవడంలో వైఫల్యం

పీసీసీ అధ్యక్షుడు శైలజానాథ్‌


కర్నూలు (అర్బన్‌), మే 29: ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి రాజ్యాంగాన్ని గౌరవించడం నేర్చుకోవాలని పీసీసీ అధ్యక్షుడు శైలజాఽనాథ్‌ హితవు పలికారు. ుక్రవారం కర్నూలు నగరంలోని ఓ హోటల్‌లో నంద్యాల డీసీసీ అధ్యక్షుడు జె.లక్ష్మీనరసింహ, ఎన్‌ఎస్‌యూఐ రాష్ట్ర అధ్యక్షుడు నాగమధు ఆధ్వర్యంలో ఆయన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా శైలజానాథ్‌ మాట్లాడుతూ రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా నిమ్మగడ్డ రమేష్‌నే కొనసాగించాలని ఇచ్చిన హైకోర్టు తీర్పును స్వాగతిస్తున్నామన్నారు. ఎన్నికల ప్రచారంలో రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధిస్తామని చెప్పిన వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి అధికారంలోకి వచ్చాక మాట తప్పారని ఆరోపించారు. పేదలు, వలస కూలీలను ఆదుకోవడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా విఫలమయ్యాయని ధ్వజమెత్తారు.


లాక్‌డౌన్‌లో ఇబ్బందిపడుతున్న ప్రతి నిరుపేద కుటుంబానికి రూ.10 వేల నగదు నేరుగా పంపిణీ చేయాలని డిమాండ్‌ చేశారు. వలస కార్మికులు తమ స్వగ్రామాలకు నడిచి వెళ్తున్నారని, ఆహారం, నీరు కూడా అందక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. ప్రభుత్వం వారందరినీ క్షేమంగా స్వస్థలాలకు పంపించాలని కోరారు. చిన్న, సూక్ష్మ పరిశ్రమల్లో పని చేస్తున్న కార్మికులు దినసరి వేతనాలతో బతుకుతున్నారని, వారికి అవసరమైన ఆర్థిక తోడ్పాటు అందించాలని కోరారు. జాబ్‌ కార్డు ఉన్నవారందరికీ 200 రోజుల ఉపాధి పని హక్కుగా కల్పించాలని డిమాండ్‌ చేశారు. కొవిడ్‌-19 ఇబ్బందులు పడుతున్న వలస కార్మికులకు, పేద, మధ్య తరగతి ప్రజలకు కాంగ్రెస్‌ పార్టీ నాయకులు సహాయ సహకారాలు అందించాలని సూచించారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీని గ్రామ స్థాయి నుంచి బలోపేతం చేస్తామని అన్నారు. కార్యక్రమంలో పీసీసీ ప్రధాన కార్యదర్శి చింతల మోహన్‌రావు, విల్సన్‌, పెద్దారెడ్డి, హ బీబ్‌ ఖాన్‌  పాల్గొన్నారు.  

Updated Date - 2020-05-30T10:00:56+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising