దంపతుల ఆత్మహత్య
ABN, First Publish Date - 2020-08-22T10:06:29+05:30
మండలంలోని కొండజూటూరులో శుక్రవారం దంపతులు ఆత్మహత్య చేసుకున్నారు. గ్రామానికి చెందిన గజ్జ వెంకటరమణ (62 ) కాశమ్మ (55 ) దంప
సూసైడ్ నోట్‌ను స్వాధీనం చేసుకున్న పోలీసులు
పాణ్యం, ఆగష్టు 21 : మండలంలోని కొండజూటూరులో శుక్రవారం దంపతులు ఆత్మహత్య చేసుకున్నారు. గ్రామానికి చెందిన గజ్జ వెంకటరమణ (62 ) కాశమ్మ (55 ) దంపతులు అనారోగ్యంతో నెల కిందట ఆసుపత్రికివెళ్లి పరీక్ష చేయించుకున్నారు. కరోనా పాజిటివ్ వచ్చినట్లు తెలిసింది. అదే సమయంలో కాశమ్మకు క్యాన్సర్ వ్యాధి ఉన్నట్లు తెలిసింది. దీంతో వాళ్లను కుమారులు హోం క్వారంటైన్‌లో ఉంచి చికిత్స అందించారు. వెంకటరమణ కోలుకోగా కాశమ్మకు క్యాన్సర్ వ్యాధి తీవ్రమైంది. దీంతో మానసిక వేదనకు గురై ఇద్దరూ ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు.
వెంకటరమణ మొదటి భార్య లక్ష్మీనరసమ్మ పక్షవాతంతో పదేళ్ల క్రితం చనిపోవడంతో కాశమ్మను వివాహం చేసుక ున్నాడు. కాశమ్మకు సంతానం లేదు. ఆత్మహత్యకు ముందు వెంకటరమణ ఒక పుస్తకంలో తమ ఆత్మహత్యకు కారణం అనారోగ్యమే అని రాసిన సూలైడ్ నోట్‌ను ఏఎస్‌ఐ బాషా స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసినట్లు ఆయన తెలిపారు. గడివేముల ఎస్‌ఐ సుబ్బరామిరెడ్డి సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నామన్నారు.
Updated Date - 2020-08-22T10:06:29+05:30 IST