ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

క్వారంటైన్‌ కేంద్రాన్ని తనిఖీ చేసిన ఎమ్మెల్యే

ABN, First Publish Date - 2020-04-01T10:46:06+05:30

సి.బెళగల్‌ ఆదర్శ పాఠశాలలో ఏర్పాటు చేసిన క్వారంన్‌టైన్‌ కేంద్రాన్ని కోడుమూరు ఎమ్మెల్యేడాక్టర్‌ సుధాకర్‌ తనిఖీ చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సి.బెళగల్‌, మార్చి 31: సి.బెళగల్‌ ఆదర్శ పాఠశాలలో ఏర్పాటు చేసిన క్వారంన్‌టైన్‌ కేంద్రాన్ని కోడుమూరు ఎమ్మెల్యేడాక్టర్‌ సుధాకర్‌ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీ.బెళగల్‌ మం డల కేంద్రంలో ఏర్పాటు చేసిన క్వారంటైన్‌ కేంద్రంలో 37 మందికి వైద్యపరీక్షలు నిర్వహిస్తున్న ట్లు తెలిపారు. కోడుమూరు మండలానికి చెందిన ము స్లింలు ఇఫ్తార్‌ కోసం ఢిల్లీ వెళ్లి వచ్చిన వారు అధికంగా ఉన్నారన్నారు.


సిబెళగల్‌, మారందొడ్డి, పులకుర్తి, బురాన్‌దొడ్డి తదితర గ్రామాలకు చెందినవారు త మ భోజనాలు సరిపడా పెట్టడం లేదని, అర్ధాకలితో అల్లాడుతున్నామని తెలుపడంతో  ఇన్‌చార్జిగా ఉన్న నోడల్‌ ఆఫీసర్‌ రంగ తులశమ్మపై ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు. అందరికీ కడుపు నిండా అన్నం పెట్టాలని ఆమెను ఆదేశించారు. అలాగే ప్రతి మండల కేంద్రానికి ఒక క్వారంటైన్‌ సెంటర్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. బయట తిరగడం మానుకోవాలని ఎమ్మెల్యే ప్రజలందరికీ చేతులెత్తి నమస్కారం చేశారు. డీలర్లు తూకాలలో మోసం చే స్తున్నారని తమ దృష్టికి వచ్చిందని ఇలాంటి చర్య లకు పాల్పడితే ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. ఎమ్మెల్యే వెంట స్థానిక డాక్టర్‌ రంగస్వామిరెడ్డి, నాగరాజు, ద్వీపక్‌, తహసీల్దార్‌ శివశంకర్‌నాయక్‌, ఎంపీడీవో రాముడు, వైఎ్‌సఆర్‌ నాయకులు ప్రభాకర్‌రెడ్డి, సోమశేఖరెడ్డి, గోపాల్‌, వెంకటేశ్‌, హారోన్‌బాషా, మ హానంది, ఎ్‌సఎం బాషా, ఈరన్నగౌడ్‌ తదితరులు ఉన్నారు. 

Updated Date - 2020-04-01T10:46:06+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising