ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఓపెన్‌ స్కూల్‌ ప్రవేశాలను విజయవంతం చేయండి

ABN, First Publish Date - 2020-09-19T10:05:48+05:30

ఓపెన్‌ స్కూల్‌ పది, ఇంటర్‌ కోర్సుల్లో ప్రవేశాలను విజయవంతం చేయాలని విద్యాశాఖ అధికారులు, కోఆర్డినేటర్లకు డీఈవో సాయిరాం సూచించారు. శుక్రవారం బి.క్యాంపు ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో ఓపెన్‌ స్కూల్‌ విద్య

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కర్నూలు(ఎడ్యుకేషన్‌), సెప్టెంబరు 18: ఓపెన్‌ స్కూల్‌ పది, ఇంటర్‌ కోర్సుల్లో ప్రవేశాలను విజయవంతం చేయాలని విద్యాశాఖ అధికారులు, కోఆర్డినేటర్లకు డీఈవో సాయిరాం సూచించారు. శుక్రవారం బి.క్యాంపు ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో ఓపెన్‌ స్కూల్‌ విద్యపై సమావేశం నిర్వహించారు. బడికి వెళ్లని, మద్యలో మానేసిన వారు ఓపెన్‌ స్కూల్‌ పది, ఇంటర్‌ ద్వారా ఉన్నత విద్య అభ్యసించవచ్చని తెలిపారు.


14 సంవత్సరాలు నిండిన వారు పదో తరగతి, 15 సంవత్సరాలు నిండి పదో తరగతి పాస్‌, పెయిల్‌ అయిన వారు ఇంటర్‌ చదివే అవకాశం ఉందన్నారు. సెలవుల్లో మాత్రమే తరగతులు ఉంటాయని, మహిళలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు, దివ్యాంగులు, మాజీ సైనిక ఉద్యోగుల పిల్లలకు ఫీజుల్లో రాయితీ ఉంటుందని అన్నారు.


ప్రచారం నిర్వహించాలని సూచించారు. కర్నూలు డివిజన్‌ ఉప విద్యాశాఖ అధికారి అనురాధ, ప్రకాష్‌ రెడ్డి, మీనాక్షి, సురేష్‌, ఓపెన్‌స్కూల్‌ కోఆర్డినేటర్‌ తిరుపతయ్య, జిల్లా కోఆర్డినేటర్‌ బుగ్గన, పాఠశాలల హెచ్‌ఎంలు తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2020-09-19T10:05:48+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising