ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నిండుకుండలా శ్రీశైలం

ABN, First Publish Date - 2020-08-22T10:14:07+05:30

ఎగువ ప్రాంతంలో కురుస్తున్న వర్షాలకు వరద ప్రవాహం కొనసాగుతోంది. గత సంవత్సరం కంటే ముందుగానే ఈసారి శ్రీశైలం డ్యాం పొంగి పొర్లే పరిస్థితి నెల

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 10 గేట్లు ఎత్తి దిగువకు నీటి విడుదల

 ప్రాజెక్టును పరిశీలించిన ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన, ఎంపీలు, ఎమ్మెల్యేలు


 కర్నూలు(అగ్రికల్చర్‌), ఆగస్టు 21: ఎగువ ప్రాంతంలో కురుస్తున్న వర్షాలకు వరద ప్రవాహం కొనసాగుతోంది. గత సంవత్సరం కంటే ముందుగానే ఈసారి శ్రీశైలం డ్యాం పొంగి పొర్లే పరిస్థితి నెలకొంది. నీలం సంజీవరెడ్డి శ్రీశైలం జలాశయం ప్రస్తుతం నిండుకుండలా తొనికిసలాడుతోంది. వరద ప్రవాహం భారీగా ఉండటంతో జలాశయం ప్రాజెక్టు పది గేట్లు ఎత్తి దిగువ ప్రాంతానికి నీటిని విడుదల చేస్తున్నారు.


శుక్రవారం రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ రెడ్డి శ్రీశైలం ప్రాజెక్టును సందర్శించి క్రసర్‌ గేట్ల నిర్వహణను పరిశీలించారు. అనంతరం శ్రీశైలం ప్రాజెక్టు వివరాలను వరద పరిస్థితిని జలాశయంలోకి వస్తున్న ఇన్‌ఫ్లో, అలాగే నదిలోకి జలాశయం నుంచి వదులుతున్న ఔట్‌ఫ్లో వివరాలను ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ రెడ్డి నీటి పారుదల శాఖ అధికారులను అడిగి తెలుసుకున్నారు.


శ్రీశైలం డ్యాం ఎడమ గట్టున్న తెలంగాణ జెన్‌కో పవర్‌ హౌస్‌ అగ్నిప్రమాదంపై కుడిగట్టున ఉన్న ఏపీజెన్‌కో సీఈ నరసింహారావును అడిగి మంత్రి వివరాలు తెలుసుకున్నారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు మన రాష్ట్రం జెన్‌కో వైపు నుంచి అలాగే పోలీసు, రెవెన్యూ, ఇరిగేషన్‌, అగ్నిమాపక తదితర శాఖల నుంచి ఎటువంటి సహాయం అడిగినా వెంటనే చేయాలని జెన్‌కో సీఈ, ఇరిగేషన్‌ సీఈ, కలెక్టర్‌ వీరపాండ్యన్‌లను ఆదేశించారు. ఏపీ జెన్‌కో తరుపున టీఎస్‌ జెన్‌కోలో గురువారం అర్దరాత్రి ప్రమాదం జరిగినప్పటి నుంచి అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తున్నామని, ఈ ఉదయం కూడా అంబులెన్సులు, డాక్టర్లు, క్రేన్లు, సిబ్బంది తదితర సాయం చేశామని ఆర్థిక మంత్రికి సీఈ నరసింహారావు వివరించారు.


శ్రీశైలం డ్యాం పరిశీలనలో నంద్యాల ఎంపీ పోచా బ్రహ్మానందరెడ్డి, శ్రీశైలం ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డి, పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్‌రెడ్డి, నంద్యాల ఎమ్మెల్యే శిల్పా రవిచంద్రకిషోర్‌ రెడ్డి, ఆళ్లగడ్డ ఎమ్మెల్యే గంగుల బిజేంద్రనాథ్‌ రెడ్డి, కర్నూలు ఎమ్మెల్యే హఫీజ్‌ఖాన్‌, కోడుమూరు ఎమ్మెల్యే సుధాకర్‌, నందికొట్కూరు ఎమ్మెల్యే తొగరూరు ఆర్ధర్‌, పత్తికొండ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి, శ్రీశైలం దేవస్థానం ఈవో రామారావు, ఈఎన్‌సీ నారాయణరెడ్డి, ఇతర నీటి పారుదల అధికారులు జలంధర్‌, కర్నూలు సీఈ మురళీనాథ్‌రెడ్డి, శ్రీశైలం ప్రాజెక్టు ఎస్‌ఈ శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2020-08-22T10:14:07+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising