శ్రీశైలానికి భారీ వరద
ABN, First Publish Date - 2020-09-14T18:57:09+05:30
ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం..
కర్నూలు(ఆంధ్రజ్యోతి): ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం కొనసాగుతోంది. జూరాల ప్రాజెక్టు నుంచి 82,375 క్యూసెక్కులు, సుంకేసుల నుంచి 43,450 క్యూసెక్కులు, హంద్రీ నుంచి 250 క్యూసెక్కుల నీరు జలాశయానికి వచ్చి చేరుతోంది. జలాశయం వద్ద ఆదివారం సాయంత్రం 1,35,379 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో నమోదైంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు, గరిష్ఠ నీటి నిల్వ సామర్థ్యం 215.807 టీఎంసీలు కాగా, 884.80 అడుగుల వద్ద 214.3637 టీఎంసీల నిల్వలు నమోదు అయ్యాయి.
వరద కొనసాగుతుండడంతో డ్యాం గేట్లను మూడింటిని పది అడుగుల మేర ఎత్తి స్పీల్ వే ద్వారా 83,949 క్యూసెక్కులు దిగువకు వదులుతున్నారు. కుడిగట్టు కేంద్రంలో విద్యుదుత్పత్తి ద్వారా 30,649 క్యూసెక్కులు సాగర్‌కు విడుదల చేస్తున్నారు.
Updated Date - 2020-09-14T18:57:09+05:30 IST