సౌకర్యాలను పట్టించుకోరా?
ABN, First Publish Date - 2020-12-12T05:04:06+05:30
ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ప్రజల సౌకర్యాలను పట్టించుకోవడంలేదని టీడీపీ కర్నూలు లోకసభ నియోజకవర్గ అధ్యక్షుడు సోమిశెట్టి వెంకటేశ్వర్లు ధ్వజమెత్తారు.
- స్కీమ్‌లన్నీ స్కామ్‌లే..
- సోమిశెట్టి వెంకటేశ్వర్లు ధ్వజం
కర్నూలు(అగ్రికల్చర్), డిసెంబరు 11: ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ప్రజల సౌకర్యాలను పట్టించుకోవడంలేదని టీడీపీ కర్నూలు లోకసభ నియోజకవర్గ అధ్యక్షుడు సోమిశెట్టి వెంకటేశ్వర్లు ధ్వజమెత్తారు. శుక్రవారం కర్నూలు నగరంలోని పార్టీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ ఏలూరులో వింత వ్యాధితో ప్రజల ఆరోగ్యం గాలిలో దీపంలా మారిందని అన్నారు. నీరు శుభ్రంగా అందించడం ప్రభుత్వాల కనీస బాధ్యత అని, అయితే జగన్ ప్రభుత్వం పూర్తిగా ఈ విషయంలో విఫలమైందని ఆరోపించారు. మంచినీటి పైపులకు, డ్రైనేజీ వ్యవస్థకు లింకు లేకుండా చూడాలని, ఎప్పటికప్పుడు తాగునీటి ట్యాంకులను క్లీనింగ్ చేయించాలని డిమాండ్ చేశారు. వైసీపీ ప్రభుత్వం ప్రతి స్కీమును స్కామ్‌గా మార్చేసిందని ధ్వజమెత్తారు. 18 నెలల పాలనలో పన్నులు, ధరలు పెంచి ప్రజలపై రూ.70 వేల కోట్ల భారం మోపారన్నారు. మరో 1.30 లక్షల కోట్ల అప్పు చేశారన్నారు. ప్రజల ప్రాణాలపై దృష్టి పెట్టి ప్రతి గ్రామంలో, నగరంలో ప్రజలకు అందించే తాగునీటిని ఎప్పటికప్పుడు ల్యాబ్‌లలో పరీక్షించి ఆ రిపోర్టుల ఆధారంగా అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు.
Updated Date - 2020-12-12T05:04:06+05:30 IST