తుగ్లక్‌ను గుర్తుకు తెస్తున్న జగన్ పాలన
ABN, First Publish Date - 2020-11-13T05:41:19+05:30
సీఎం జగన్ ఏడాదిన్నర పాలన పిచ్చి తుగ్లక్‌ను గుర్తుకు తెస్తోందని టీడీపీ కర్నూలు లోక్‌సభ నియోజకవర్గ అధ్యక్షుడు సోమిశెట్టి వెంకటేశ్వర్లు ధ్వజమెత్తారు.
- టీడీపీ కర్నూలు లోక్‌సభ అధ్యక్షుడు సోమిశెట్టి
కర్నూలు(అగ్రికల్చర్), నవంబరు 12: సీఎం జగన్ ఏడాదిన్నర పాలన పిచ్చి తుగ్లక్‌ను గుర్తుకు తెస్తోందని టీడీపీ కర్నూలు లోక్‌సభ నియోజకవర్గ అధ్యక్షుడు సోమిశెట్టి వెంకటేశ్వర్లు ధ్వజమెత్తారు. గురువారం నగరంలోని పార్టీ కార్యాలయంలో మాట్లాడుతూ లక్షలాది మంది భక్తుల మనోభా వాలను దెబ్బతీస్తే మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. నదిలో పుష్కర స్నానాలు చేయకూడదన్న నిర్ణయంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. కరోనా ఏప్రిల్ నుంచే వ్యాప్తి చెందుతూ వచ్చిందని, ముందస్తు చర్యలు తీసుకోకపోవడం వల్లే దేశంలోనే అధికంగా మన రాష్ట్రంలో బాధితులు ఉన్నారని ఆందోళన వ్యక్తం చేశారు. రూ.200 కోట్ల ప్రజాధనంతో పుష్కరాల పనులు చేశారని, పుష్కర స్నానాలు వద్దని మొదట్లోనే ప్రకటించి ఉంటే ఈ నిధులు మిగిలి ఉండేవ న్నారు. అమరావతిలో రూ. కోట్లు ఖర్చుచేసి నిర్మించిన భవనాలు నిరుపయోగంగా మారేలా రాజధాని తరలింపు తెచ్చరని అన్నారు. టీడీపీ నిర్మించిన గృహాలను లబ్ధిదా రులకు ఇవ్వకుండా నిరుప యోగంగా మార్చారని సోమిశెట్టి మండిపడ్డారు.
Updated Date - 2020-11-13T05:41:19+05:30 IST