ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అమ్మఒడి జాబితాలను పరిశీలించి పంపాలి

ABN, First Publish Date - 2020-12-28T05:17:35+05:30

అమ్మఒడి జాబితాలను క్షుణ్ణంగా పరిశీలించి అనర్హులు, విత్‌హెల్డ్‌ లిస్టుల్లో ఉన్న వారి వినతులను సరి చూసి ఆంధ్రప్రదేశ్‌ పాఠశాల విద్యా డైరెక్టర్‌కు పంపించి సమస్యలను పరిష్కరించాలని జిల్లా విద్యాశాఖ అధికారి సాయిరాం ఒక ప్రకటలో ఆదివారం తెలిపారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

   జిల్లా విద్యాశాఖ అధికారి సాయిరాం


  కర్నూలు(ఎడ్యుకేషన్‌), డిసెంబరు 27: అమ్మఒడి జాబితాలను క్షుణ్ణంగా పరిశీలించి అనర్హులు, విత్‌హెల్డ్‌ లిస్టుల్లో ఉన్న వారి వినతులను సరి చూసి  ఆంధ్రప్రదేశ్‌ పాఠశాల విద్యా డైరెక్టర్‌కు  పంపించి సమస్యలను పరిష్కరించాలని జిల్లా విద్యాశాఖ అధికారి సాయిరాం ఒక ప్రకటలో ఆదివారం తెలిపారు. జిల్లాలోని అమ్మఒడి పథకం అర్హుల జాబితాలో 6,48,503, అనర్హుల జాబితాలో 66,591 మంది, విత్‌హెల్డ్‌ జాబితాలో 10,907 మంది ఉన్నారన్నారు. అర్హత కలిగిన తల్లుల బ్యాంకు అకౌంటు నెంబర్‌, ఐఎ్‌ఫఎ్‌ససీ కోడ్‌ నెంబరు మరొకసారి సరి చూసుకోవాలని  పాఠశాల ప్రధానోపాధ్యాయులకు ఆయన తెలియజేశారు. మూడు జాబితాల్లో పేర్లు లేని విద్యార్థులు ఎవరైనా ఉంటే వారి వివరాలు గూగుల్‌ సైట్‌లో  ఆన్‌లైన్‌ ద్వారా పూరించి, 28వ తేదీ సాయంత్రంలోగా జిల్లా విద్యాశాఖ కార్యాలయానికి పంపాలన్నారు. 28వ తేదీన అన్ని పాఠశాలల్లో పేరెంట్‌ కమిటీల సమావేశం నిర్వహించి అర్హుల జాబితాను తెలయజేయాలన్నారు. ఈ నెల 30వ తేదీ నాటికి గ్రామ సచివాలయంలో అభ్యంతరాల పరిష్కారాలు పూర్తి కావాలన్నారు. అలాగే 31వ తేదీన గ్రామ సభలు నిర్వహించి అర్హుల తుది జాబితాను ఆమోదించాలని డీఈవో తెలిపారు. విద్యార్థుల జాబితాలో సవరణ కోసం ప్రధానోపాధ్యాయులకు లాగిన్‌   ఇస్తున్నట్లు తెలిపారు.  ముఖ్యంగా ప్రైవేటు స్కూళ్లలో చదువుతున్న విద్యార్థుల జాబితా విషయంలో ఆ పాఠశాలల యజమాన్యాలు బాధ్యత వహించవలసి ఉంటుందన్నారు.  

Updated Date - 2020-12-28T05:17:35+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising