ఎర్రచందనం స్మగ్లర్ల కోసం గాలింపు
ABN, First Publish Date - 2020-11-14T05:26:59+05:30
మండలంలోని చిన్నవంగలి గ్రామ నల్లమల అటవీ ప్రాంతంలో ఎర్రచందనం స్మగ్లర్ల కోసం అటవీ అధికారులు, ప్రొటెక్షన్ వాచర్లు కూంబింగ్ చేపట్టారు.
చాగలమర్రి, నవంబరు 13: మండలంలోని చిన్నవంగలి గ్రామ నల్లమల అటవీ ప్రాంతంలో ఎర్రచందనం స్మగ్లర్ల కోసం అటవీ అధికారులు, ప్రొటెక్షన్ వాచర్లు కూంబింగ్ చేపట్టారు. శుక్రవారం నల్లమల అటవీ ప్రాంతంలో తమిళ కూలీల కోసం ఆరా తీశారు. 25 ఎర్రచందనం దుంగలను మోసుకెళ్తే పరారైన తమిళ కూలీల ఆచూకీ కోసం సబ్ డీఎఫ్ మారుతీ ప్రసాద్, రేంజర్ శ్రీరాములు ఆదేశాల మేరకు గాలింపు చేస్తున్నామని ఎఫ్‌వో విశోర్‌కుమార్ తెలిపారు. కూలీలు తాగేందుకు వాడిన బీడీల కవర్లు, ఇతర వస్తువుల ద్వారా తమిళ కూలీలుగా గుర్తించినట్లు తెలిపారు. దుండగులు నరికిన ఎర్రచందనం జిల్లా పరిధిలోని నల్లమల ప్రాంతంలోనివి కావని తెలిపారు. కడప జిల్లా పరిసరాల్లో నరికి కర్నూలు జిల్లా చాగలమర్రి మండలం చిన్నవంగలి మీదుగా తరలించే ప్రయత్నం చేశారని అన్నారు.
Updated Date - 2020-11-14T05:26:59+05:30 IST