ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రెడ్‌జోన్‌లో ఆకలి కేకలు

ABN, First Publish Date - 2020-05-09T08:32:29+05:30

లాక్‌డౌన్‌ వల్ల నంద్యాల పట్టణంలో ఆకలి కేకలు వినిపించాయి. మున్సిపల్‌ కార్యాలయం సమీపంలోని సలీం

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రోడ్డు మీదకు వందలాది మంది..


నంద్యాల టౌన్‌, మే 8: లాక్‌డౌన్‌ వల్ల నంద్యాల పట్టణంలో ఆకలి కేకలు వినిపించాయి. మున్సిపల్‌ కార్యాలయం సమీపంలోని సలీం నగర్‌ రెడ్‌జోన్‌లో ఉంది. దీనితో ఇండ్ల నుంచి బైటికి రావద్దని అధికారులు, పోలీసులు స్థానికులను కట్టడి చేశారు. ఇళ్లకే నిత్యావసరాలు సరఫరా చేస్తామని అన్నారు. కానీ ఆచరణలో ఏమీ జరగలేదు. కాలనీ వాసులు సచివాలయం, వార్డు వలంటీర్ల దృష్టికి తీసికెళ్లారు. వాళ్లూ స్పందించలేదు. నిత్యావసర వస్తువులు లేక ఆకలితో ఇబ్బంది పడలేక శుక్రవారం వందలాదిగా కాలనీ వాసులు వీధుల్లోకి వచ్చి ఆందోళన చేశారు. పోలీసులు, మున్సిపల్‌ అధికారులు వారితో చర్చించారు. నిత్యావసర వస్తువులు, కూరగాయలు అందేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. దీనితో స్థానికులు ఆందోళన విరమించారు.


పట్టించు కోవటం లేదు: ఫాతిమా, సలీం నగర్‌

కొన్ని రోజులుగా కూరగాయలు లేక వంట చేయడమే కష్టమైనది. ఇంటి నుంచి బయటకు రావద్దని అంటున్నారు. ఇంటికే సరుకులు అందిస్తామని చెప్పారు. కానీ పట్టించుకోవటం లేదు. 

Updated Date - 2020-05-09T08:32:29+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising