ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ముగిసిన సైంటిఫిక్‌ అసిస్టెంట్‌ రాత పరీక్ష

ABN, First Publish Date - 2020-12-07T05:03:43+05:30

రాష్ట్ర హోంశాఖ పరిధిలోని స్టేట్‌ లెవల్‌ పోలీస్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డు (ఎస్‌ఎల్‌పీఆర్‌బీ) ఫోరెన్సిక్‌ సైన్స్‌ ల్యాబొరేటరీ సైంటిఫిక్‌ అసిస్టెంట్‌ పోస్టులకు నిర్వహించిన రాత పరీక్ష ఆదివారం ప్రశాంతంగా ముగిసింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కర్నూలు, డిసెంబరు 6:  రాష్ట్ర హోంశాఖ పరిధిలోని స్టేట్‌ లెవల్‌ పోలీస్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డు (ఎస్‌ఎల్‌పీఆర్‌బీ) ఫోరెన్సిక్‌ సైన్స్‌ ల్యాబొరేటరీ సైంటిఫిక్‌ అసిస్టెంట్‌ పోస్టులకు నిర్వహించిన రాత పరీక్ష ఆదివారం ప్రశాంతంగా ముగిసింది. ఈ   పరీక్ష కర్నూలులో పుల్లారెడ్డి ఇంజనీరింగ్‌ కళాశాల, పుల్లయ్య కాలేజ్‌ ఆఫ్‌ ఇంజనీరింగ్‌ అండ్‌ టెక్నాలజీ కళాశాలలో ఉదయం 11 నుంచి 1 గంట వరకు నిర్వహించారు. పరీక్ష కేంద్రాల్లో భద్రతా ఏర్పాట్లను కర్నూలు రేంజ్‌ డీఐజీ వెంకట్రామిరెడ్డి, జిల్లా ఎస్పీ ఫక్కీరప్ప పరిశీలించారు.   ఈ పరీక్షకు పుల్లారెడ్డి ఇంజనీరింగ్‌ కళాశాలలో 748 మంది అభ్యర్థులకు గాను  672 మంది అభ్యర్థులు పరీక్ష రాశారు. పుల్లయ్య కాలేజ్‌ ఆఫ్‌ ఇంజనీరింగ్‌ అండ్‌ టెక్నాలజీ కళాశాలలో 738 మందికి గాను  674 మంది అభ్యర్థులు హాజరయ్యారు. మొత్తం 1486 మంది అభ్యర్థులకు గాను  1346 మంది పరీక్షకు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ఏఆర్‌ అడిషనల్‌ ఎస్పీ రాధాకృష్ణ, పుల్లారెడ్డి కాలేజ్‌ ప్రిన్సిపాల్‌ (కో ఆర్డినేటర్‌) శ్రీనివాసరెడ్డి, పుల్లయ్య కళాశాల ప్రిన్సిపాల్‌ శ్రీనివాసులు, డీఎస్పీలు యుగంధర్‌ బాబు, రామాంజినాయక్‌, వెంకటాద్రి, కేవీ మహేష్‌ ఉన్నారు.

Updated Date - 2020-12-07T05:03:43+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising