ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సంచార సంజీవని ప్రారంభం

ABN, First Publish Date - 2020-07-18T10:50:57+05:30

జిల్లాలో సంచార సంజీవని సేవలు ప్రారంభమయ్యాయి. కొవిడ్‌ నిర్ధారణ పరీక్షలు నిర్వహించేందుకు ఏర్పాటు చేసిన ..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కర్నూలు, జూలై 17(ఆంధ్రజ్యోతి): జిల్లాలో సంచార సంజీవని సేవలు ప్రారంభమయ్యాయి. కొవిడ్‌ నిర్ధారణ పరీక్షలు నిర్వహించేందుకు ఏర్పాటు చేసిన సంచార వాహనాలను డీఆర్వో పుల్లయ్య, కర్నూలు ఆర్టీసీ రీజినల్‌ మేనేజర్‌ వెంకటరామం ప్రారంభించారు. కలెక్టరేట్‌ ప్రాంగణంలో శుక్రవారం ఈ కార్యక్రమం జరిగింది. తొలి రోజు కలెక్టరేట్‌లోని వివిధ విభాగాల ఉద్యోగులకు కొవిడ్‌ పరీక్షలు నిర్వహించారు.


ఈ సందర్భంగా డీఆర్వో మాట్లాడుతూ కలెక్టర్‌ జి.వీరపాండియన్‌ ఆదేశాలు మేరకు సంచార సంజీవని సేవలను విస్తృతం చేశామని తెలిపారు. వీటి ద్వారా జిల్లాలోని మూడు డివిజన్‌లలో కరోనా పరీక్షలపై ప్రజలకు అవగాహన కల్పిస్తామని తెలిపారు. జిల్లాలో ఇప్పటికే మూడు సంజీవని వాహనాలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. నగర, పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో అనుమానితుల నుంచి నమూనాలను సేకరించేందుకు ఈ వాహనాలను వినియోగిస్తామని తెలిపారు. ఒక్కో బస్సులో ఒకేసారి పదిమందికి పరీక్షలు చేసేలా ఏర్పాట్లు ఉన్నాయని తెలిపారు. కార్యక్రమంలో నమూనాల సేకరణ నోడల్‌ అధికారి విశ్వేశ్వరయ్య, వైద్యాధికారులు పాల్గొన్నారు. 

Updated Date - 2020-07-18T10:50:57+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising