ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సంగమేశ్వరంలో తగ్గిన భక్తుల తాకిడి

ABN, First Publish Date - 2020-11-27T05:39:40+05:30

సప్తనదీ సంగమేశ్వర క్షేత్రంలో జరుగుతున్న తుంగ భద్ర పుష్కరాలకు ఏడో రోజైన గురు వారం భక్తుల తాకిడి తగ్గింది.

సంగమేశ్వరంలో పుష్కర ఘాట్‌ వద్ద భక్తుల పూజలు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆత్మకూరు/కొత్తపల్లి, నవంబరు 26: సప్తనదీ సంగమేశ్వర క్షేత్రంలో జరుగుతున్న తుంగ భద్ర పుష్కరాలకు ఏడో రోజైన గురు వారం భక్తుల తాకిడి తగ్గింది. నివర్‌ తుఫాన్‌ ప్రభా ంతో భక్తులు పెద్దగా పుష్క రాలకు హాజరు కాలే దు.ఉమామహేశ్వర స్వామికి, గాయ త్రీదేవీ, గణపతి ఉత్సవమూర్తులకు ఆలయ ప్రధాన పురోహి తులు తెలకపల్లి రఘురామశర్మ పుష్కర జలాలచే అభిషే కించారు. తదుపరి విశేష అలంకరణ గావించి పూజల క్రతువులను శాస్రోక్తంగా జరిపారు. కాగా క్షేత్రంలో పుష్కర బృహస్పతి గాయత్రీ యాగాన్ని కొనసా గించారు. అదేవిధంగా ఎగువ ఉమామహేశ్వ రాలయంలో విశేష పూజలను చేపట్టారు. సాయంత్రం 6గంటల సమ యంలో పుష్కర జలాలకు సంధ్యాహారతిని నివేదించారు. గురువారం సుమారు 600 మంది భక్తులు క్షేత్రానికి తరలి వచ్చినట్లు అధికారులు అంచనా వేశారు. పుష్కర ఏర్పాట్లను స్పెషల్‌ డిప్యూటీ కలెక్టర్‌ చంద్రమోహన్‌, డ్వామా పీడీ వెంగన్న, తహసీల్దార్‌ శ్రీనివాసులు, ఎంపీడీవో చంద్ర శేఖర్‌, ఎంఈవో శ్రీరాములు, దేవస్థానం ఈవో నాగర పసాద్‌ ఎప్ప టికప్పుడు పర్యవేక్షించారు. సప్తనదీ సంగమేశ్వర క్షేత్రాన్ని నందికొట్కూరు వైసీపీ నాయకులు బైరెడ్డి సిద్ధార్థరెడ్డి సందర్శించారు. ఎగువ పుష్కర ఘాట్‌ ఒడ్డున తుంగభద్రమాత విగ్రహ స్థాపన కార్యక్రమాన్ని జరిపారు. నందికొట్కూరు ఎమ్మెల్యే ఆర్థర్‌ సహకారంతో రూ.80వేలతో తుంగభద్ర విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఆలయ పురోహితులు తెలకపల్లి రఘురామశర్మ తుంగభద్ర మాత విగ్రహానికి విశేష పూజలను నిర్వహిం చారు. స్పెషల్‌ డిప్యూటీ కలెక్టర్‌ చంద్రమోహన్‌ చేతుల మీదుగా మంగళహారతులను నివేదించారు. 

Updated Date - 2020-11-27T05:39:40+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising