ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఘనంగా రాజ్యాంగ దినోత్సవం

ABN, First Publish Date - 2020-11-27T05:59:52+05:30

ట్రైనీ ఐపీఎస్‌ అధికారి కొమ్మి ప్రతాప్‌ శివకిషోర్‌ ఆధ్వర్యంలో గురువారం జిల్లా పోలీస్‌ కార్యాలయంలోని పరేడ్‌ మైదానంలో 71వ భారత రాజ్యాంగ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కర్నూలు, నవంబరు 26:   ట్రైనీ ఐపీఎస్‌ అధికారి కొమ్మి ప్రతాప్‌ శివకిషోర్‌ ఆధ్వర్యంలో గురువారం జిల్లా పోలీస్‌ కార్యాలయంలోని పరేడ్‌ మైదానంలో 71వ భారత రాజ్యాంగ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు.   ఏఈఆర్‌ డీఎస్పీ ఇలియాజ్‌ బాషా రాజ్యాంగ దీపికను చదివి వినిపించి పోలీసులు, సిబ్బంది చేత ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో ట్రైనీ ఐపీఎస్‌ అధికారులు  ఎస్‌ రమణ, కేవీ మహేశ్వరరెడ్డి, అడిషనల్‌ ఎస్పీలు మధుసూదన్‌రావు, రాధాకృష్ణ, ఏవో సురే్‌షబాబు, ఎస్పీ పీఏ నాగరాజు పాల్గొన్నారు.


కర్నూలు(లీగల్‌): స్థానిక న్యాయ సేవా సంస్థ ఆధ్వర్యంలో 71వ రాజ్యాంగ దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు. ఉదయం 10.30 గంటలకు న్యూఢిల్లీ నుంచి జాతీయ న్యాయసేవా సంస్థ అధికారులు వెబ్‌నార్‌లో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో జిల్లా న్యాయ సేవా సంస్థ కార్యదర్శి శ్రీనివాసరావు, ప్యానెల్‌ న్యాయవాదులు, పారా లీగల్‌ వలంటీర్లు, లోక్‌అదాలత్‌ సిబ్బంది పాల్గొన్నారు. 


ప్రసూనా న్యాయ కళాశాలలో.. ప్రసూనా న్యాయ కళాశాలలో ప్రిన్సిపాల్‌ డా.ఎం.శివాజీరావు ఆధ్వర్యంలో రాజ్యాంగ దినోత్సవాన్ని నిర్వహించారు. లా కళాశాల లెక్చరర్లు, సిబ్బంది పాల్గొన్నారు. 


లాయర్స్‌ ఫోరం ఆధ్వర్యంలో : ఎస్సీ, ఎస్టీ లాయర్స్‌ ఫోరం ఆధ్వర్యంలో గురువారం 71వ రాజ్యాంగ దినోత్సవాన్ని  నిర్వహించారు. పాత బస్టాండులోని అంబేడ్కర్‌ సర్కిల్‌లో లాయర్స్‌ ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు వై.జయరాజ్‌ ఆధ్వర్యంలో న్యాయవాదులు, ఉద్యోగులు, సామాజిక కార్యకర్తలు పాల్గొన్నారు. 


కర్నూలు(అగ్రికల్చర్‌): ప్రపంచంలోనే భారత రాజ్యాంగం అత్యున్నతమైనదని, అలాంటి రాజ్యాంగాన్ని అందించిన ఘనత డా.బీఆర్‌ అంబేడ్కర్‌కే దక్కుతుందని టీడీపీ కర్నూలు లోక్‌సభ నియోజకవర్గ అధ్యక్షుడు సోమిశెట్టి వెంకటేశ్వర్లు అన్నారు.  గురువారం కర్నూలులోని పార్టీ కార్యాలయంలో   రాజ్యాంగ దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సోమిశెట్టి విలేఖరులతో మాట్లాడుతూ దేశమంతటా అంబేద్కర్‌ రచించిన రాజ్యాంగం అమలవుతోంటే.. రాష్ట్రం లో మాత్రం  రాజారెడ్డి రాజ్యాంగాన్ని ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌ రెడ్డి అమ లు చేస్తున్నారని ఆరోపించారు. అన్ని రాజ్యాంగ వ్యవస్థలను మంటగలిపి తాను అనుకున్నదే   ముఖ్యమంత్రి జగన్‌ అమలు చేస్తూ ప్రజల్ని రాచిరంపాన పెడుతున్నారని మండిపడ్డారు. ఈ పరిస్థితుల్లో రాజ్యాంగాన్ని కాపాడాల్సిన బాధ్యత శాసన, కార్య, న్యాయ వ్యవస్థలపై ఉందన్నారు.   


కర్నూలు(న్యూసిటీ): భారత రాజ్యాంగ నిర్మాత  డా.బీఆర్‌. అంబేద్కర్‌ ఆశయసాదనకు ప్రతి ఒక్కరూ  కృషి చేయాలని డా.బీఆర్‌. అంబేద్కర్‌ స్వచ్ఛ భారత్‌ రచ్చబండ సేవా సమితి జిల్లా అధ్యక్షుడు వి.శ్రీనివాసులు అన్నారు. మంగళవారం 71వ భారత రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా సమితి ఆధ్వర్యంలో పాతబస్టాండులోని అంబేద్కర్‌ విగ్రహనికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.  ఈకార్యక్రమంలో గౌరవ అధ్యక్షుడు వాణి పుల్లయ్య, కార్యదర్శి వి. బాబురావు, కోశాదికారి ఎం.రంగమునిస్వామి, విశ్రాంత సీఈ మన్మథరావు, విశ్రాంత డీఎస్పీ జయచంద్ర, వి.పుల్లయ్య, గిరిధర్‌ పాల్గొన్నారు.


తుగ్గలి: మన దేశ విభిన్న సంస్కృతులను దృష్టిలో ఉంచుకొని   నిర్మించిన రాజ్యాంగాన్ని గౌరవించాలని స్వేరో సర్కిల్‌ కర్నూలు జిల్లా అధ్యక్షుడు నాగేష్‌ అన్నారు. గురువారం రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా మండలంలోని  జొన్నగిరి ఆర్‌డీటీ భవనంలో డాక్టర్‌ బిఆర్‌ అంబేడ్కర్‌ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. స్వేరో సర్కిల్‌ సభ్యులు అంజి, శ్రీనివాసులు, ప్రకాష్‌   పాల్గొన్నారు. 


కర్నూలు(స్పోర్ట్స్‌): నగరంలోని సెట్కూర్‌ కార్యాలయంలో భారత రాజ్యాంగ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ముఖ్య అతిథిగా సెట్కూరు సీఈవో నాగరాజనాయుడు, ఫస్ట్‌ స్టెఫ్‌ సొసైటీ అధ్యక్షుడు రాజశేఖర్‌ హాజరయ్యారు.   సెట్కూర్‌ మేనేజర్‌ రమణ, సిబ్బంది, మొయినుద్దీన్‌, మౌలాలి, సుదర్శనం, కిరణ్‌కుమార్‌, దివాకర్‌, రామమద్దిలేటి పాల్గొన్నారు.


కర్నూలు(ఎడ్యుకేషన్‌): కర్నూలు నగరంలోని రాజ్‌విహార్‌ సర్కిల్‌ అంబేద్కర్‌ భవనంలోని డా.బీఆర్‌ అంబేద్కర్‌ విగ్రహానికి ఏఎ్‌సడబ్లూవో రవీంద్రనాథ్‌రెడ్డి పూలమాలలు వేసి రాజ్యాంగ దినాన్ని నిర్వహించారు. హాస్టల్‌ వెల్ఫేర్‌ ఆఫీసర్‌ సులోచన, కల్పన, ప్రకాష్‌, నాల్గవ తరగతి ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షురాలు దిబ్బలమ్మ, ప్రధాన కార్యదర్శి టి.శ్రీరాములు   పాల్గొన్నారు. 


కర్నూలు(రూరల్‌): కర్నూలు మండల పరిషత్‌ అభివృద్ధి కార్యాలయంలో గురువారం ఎంపీడీవో నాగశివలీల భారత రాజ్యాంగ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ బి.ఆర్‌. అంబేద్కర్‌ చిత్రపటానికి  ఆమె పూలమాల వేసి నివాళర్పించారు.  ఈ కార్యాక్రమంలో ఈవోఆర్డీ రఘునాథ్‌, సూపరింటెండెంట్‌ భాస్కరనాయుడు, సీనియర్‌ అసిస్టెంట్‌ కార్యాలయ సిబ్బంది  పాల్గొన్నారు. కర్నూలు రూరల్‌ తహసీల్దార్‌  కార్యాలయంలో భారతరాజ్యాంగ 71వ దినోత్సవాన్ని నిర్వహించారు. తహసీల్దార్‌ వెంకటేష్‌ నాయక్‌ పాల్గొన్నారు.  అంబేద్కర్‌ చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. 


పత్తికొండటౌన్‌: పట్టణంలో గురువారం భారత రాజ్యాంగ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఎంఆర్‌పీఎస్‌ ఆదోని డివిజన్‌ ఇన్‌చార్జి ప్రతాప్‌, సలహాదారుడు యేసేపు ఆధ్వర్యంలో అంబేడ్కర్‌కు  పూలమాలలు వేశారు.  


కోడుమూరు: పట్టణంలో ఎంఆర్‌పీఎస్‌ నాయకులు 71వ భారత రాజ్యాంగ దినోత్సవ వేడుకలను గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అంబేద్కర్‌ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. ఎంఆర్‌పీఎస్‌ జిల్లా నాయకులు ఆంధ్రయ్య, నాయకులు ఈరన్న, రాముడు, తిమ్మన్న, దేవదానం పాల్గొన్నారు.  


ఎమ్మిగనూరు టౌన్‌/నందవరం/గోనెగండ్ల: ఎమ్మిగనూరు పట్టణంలో గురువారం 71వ రాజ్యాంగ దినోత్సవాన్ని నిర్వహించారు. గీతానగర్‌లో ఎమ్మా ర్పీఎస్‌ రాష్ట్ర కార్యదర్శి ఆనంద్‌చైతన్య అంబేడ్కర్‌ చిత్రపటానికి నివాళి అర్పిం చారు. ప్రభాకర్‌, నరసన్న, జకరయ్య, శ్రీనివాసులు పాల్గొన్నారు. ఏస్టీయూ కార్యాలయంలో  ప్రసన్నరాజు, బసవరాజు, వెంకటేశ్వర్లు, తిమ్మరాజు, ఎర్రన్న పాల్గొన్నారు.  అంబేడ్కర్‌ భవన సాధన కమిటీ చైర్మన్‌ కదిరికోట ఆదెన్న నివాళి అర్పించారు.   రోజా ఆర్ట్స్‌ ఉసేని, మునిస్వామి, జగతాప్‌, జైపాల్‌ పాల్గొన్నా రు. ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీ స్టూడెంట్స్‌ ఫెడరేషన్‌ ఉపాధ్యక్షుడు సురేష్‌, మనోహర్‌, నవీన్‌, మహ్మద్‌ పాల్గొన్నారు. ఎస్‌ఎంఎల్‌ కళాశాల ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ మహబూబ్‌బాషా రాజ్యాంగ దినోత్సవాన్ని నిర్వహించారు. వైస్‌ ప్రిన్సిపాల్‌ శ్రీని వాసగణప, అధ్యాపకుడు తిరుపతిరెడ్డి, ఎన్‌ఎస్‌ఎస్‌ పీవో హరీష్‌బాబు పాల్గొన్నారు. బనవాసి గురుకులంలో ప్రిన్సిపాల్‌ సాజిదాబేగం పాల్గొన్నారు. నందవరం మండలం కనకవీడు గ్రామంలో రాజ్యంగ దినోత్సవాన్ని జరు పుకు న్నారు. రాజు, డబ్బా ఈరన్న, మాల నాగప్ప, ఏలీయా, ప్రసంగి,  షడ్రక్‌, దేవస హాయం, నరసన్న, నరసింహులు పాల్గొన్నారు. గోనెగండ్ల ఎస్సీ కాలనీలో టీడీపీ నాయకులు నాగరాజు ఆధ్వర్యంలో అబేండ్కర్‌ చిత్రపటానికి నివాళి అర్పించారు.


Updated Date - 2020-11-27T05:59:52+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising