ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

విశ్వభారతిలో ఐసొలేషన్‌ వార్డులు సిద్ధం: కలెక్టర్‌

ABN, First Publish Date - 2020-03-30T10:59:48+05:30

కరోనా వైరస్‌ వ్యాధికి గురైన బాఽధితులకు చికిత్స అందించేందుకు కోడుమూరు సమీపంలోని విశ్వభారతి ఆసుపత్రిలో ఐసొలేషన్‌ వార్డులు సిద్ధం అయ్యాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కర్నూలు, మార్చి 29 (ఆంధ్రజ్యోతి): కరోనా వైరస్‌ వ్యాధికి గురైన బాఽధితులకు చికిత్స అందించేందుకు కోడుమూరు సమీపంలోని విశ్వభారతి ఆసుపత్రిలో ఐసొలేషన్‌ వార్డులు సిద్ధం అయ్యాయి. ఆదివారం కలెక్టర్‌ జి. వీరపాండియన్‌ విశ్వభారతి ప్రైవేటు మెడికల్‌ ఆసుపత్రిని ఏర్పాటు చేసిన ఐసొలేషన్‌ వార్డులను పరిశీలించారు. కోవిడ్‌-19 ఆసుపత్రిగా మార్చేందుకు వీలుగా చేసిన సదుపాయాలను ఆసుపత్రి చీఫ్‌ ఆర్‌ఎంవో డాక్టర్‌ వెంకటరత్నం కలెక్టర్‌కు వివరించారు.


అంతకు ముందు విదేశాల నుంచి నగరానికి వచ్చి హోమ్‌ ఐసొలేషన్‌లో ఉన్న వీధులను కలెక్టర్‌ పర్యవేక్షించారు. వెంకటరమణ కాలనీ, రామలింగేశ్వరనగర్‌, అశోక్‌నగర్‌, ఎన్‌ఆర్‌ పేట, అబ్బాస్‌ నగర్‌, ఐటీ సర్కిల్‌, గణేష్‌ నగర్‌, టెలికాం నగర్‌, నంద్యాల చెక్‌పోస్టు తదితర ప్రాంతాలను సందర్శించి సంబంధిత అధికారులకు పలు సూచనలు చేశారు. నగరంలో కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు కాకుండా లాక్‌డౌన్‌ను మరింత కఠినతరం చేయాలని కలెక్టర్‌ వీరపాండియన్‌ పోలీసు అధికారులను ఆదేశించారు. 

Updated Date - 2020-03-30T10:59:48+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising