ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అక్రమ మైనింగ్‌పై తనిఖీలు

ABN, First Publish Date - 2020-12-03T05:35:46+05:30

మండలంలోని చెర్లోపల్లె గ్రామ పరిధిలోని 707 సర్వే నెంబర్‌లోని అక్రమ మైనింగ్‌పై తనిఖీలు నిర్వహించినట్లు మైనింగ్‌ ఏడీ వేణుగోపాల్‌ బుధవారం తెలిపారు.

మైనింగ్‌ అధికారితో వాగ్వాదానికి దిగిన ప్రజా సంఘాల నాయకులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అవుకు, డిసెంబరు 2: మండలంలోని చెర్లోపల్లె గ్రామ పరిధిలోని 707 సర్వే నెంబర్‌లోని అక్రమ మైనింగ్‌పై తనిఖీలు నిర్వహించినట్లు మైనింగ్‌ ఏడీ వేణుగోపాల్‌ బుధవారం తెలిపారు. ఆయన మాట్లాడుతూ తమ శాఖకు అందిన ఫిర్యాదుల మేరకు అక్రమ మైనింగ్‌పై తనిఖీలు జరిపామన్నారు. సూర్య నాగిరెడ్డి అనే వ్యక్తికి చెందిన మైనింగ్‌ లీజు గడువు 6 నెలల క్రితం ముగిసిందన్నారు. ప్రభుత్వానికి మైనింగ్‌ లీజు కోసం ధరఖాస్తు చేసుకోగా పెండింగ్‌లో ఉందన్నారు. లీజు మంజూరయ్యే వరకు మైనింగ్‌ నిలిపి వేయాలని ఆదేశాలు జారీ చేశామన్నారు. అక్రమ మైనింగ్‌కు పాల్పడితే చర్యలు తప్పవన్నారు. అయితే ప్రజా సంఘాల నాయకులు అధికారులతో వాగ్వాదానికి దిగారు. లీజు మంజూరు కాకపోయిన్పటికీ అక్రమ మైనింగ్‌ జరుగుతున్న వ్యక్తిపై చర్యలు తీసుకోకుండా, మైనింగ్‌ ప్రాంతంలోని నాపరాతి కటింగ్‌ మిషన్లు, నాపరాతిని తరలించే ట్రాక్టర్లు ఉన్నప్పటీకీ అధికారులు వాటిని స్వాధీనం చేసుకోక పోవటంలోని ఆంతర్యం ఏమిటని ప్రజా సంఘాల నాయకులు అధికారులను నిలదీశారు. తమ కార్యాలయానికి వస్తే తగిన సమాచారం ఇస్తామని అధికారులు అక్కడి నుంచి జారుకున్నారు.








Updated Date - 2020-12-03T05:35:46+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising