ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎస్‌ఈగా ఓబుల్‌ కొండారెడి?

ABN, First Publish Date - 2020-05-30T10:02:13+05:30

విద్యుత్‌శాఖ ఎస్‌ఈగా ఓబుల్‌ కొండారెడ్డిని నియమించేందుకు రంగం సిద్ధమైనట్లు విశ్వసనీయ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వీఆర్‌ఎస్‌కు ఎస్‌ఈ భార్గవ రాముడు 


కర్నూలు (అర్బన్‌), మే 29: విద్యుత్‌శాఖ ఎస్‌ఈగా ఓబుల్‌ కొండారెడ్డిని నియమించేందుకు రంగం సిద్ధమైనట్లు విశ్వసనీయ సమాచారం. ప్రస్తుత ఎస్‌ఈ భార్గవ రాముడు వాలంటరీ రిటైర్మెంట్‌ తీసుకోవడం చర్చనీయాంశమైంది. శుక్రవారం ఆయన తన చాంబర్‌లో ఈ విషయం వెల్లడించారు. విద్యుత్‌ భవన్‌లో శనివారం జరిగే వీడ్కోలు సమావేశం ఏర్పాట్లను ఉద్యోగులు పరిశీలించారు. ఈ సభకు సీఎండీ హరినాథరావు హాజరవుతున్నారని, భౌతిక దూరం పాటిస్తూ కొద్దిమందితోనే కార్యక్రమం పూర్తి చేస్తామని తెలిపారు.


అంతకముందు కడప జిల్లాలో పనిచేస్తున్న ఓబుల్‌ కొండారెడ్డి శుక్రవారం ఎం అండ్‌ పీ ఈఈగా బాధ్యతలు తీసుకున్నారు. ఈయనకు ఎస్‌ఈగా అదనపు బాధ్యతలు అప్పజెప్పనున్నట్లు తెలిసింది. గత ఏడాదిగా ఆయన కడప జిల్లా నుంచి ఎస్‌ఈగా కర్నూలు రావాలని విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. అయితే పదవీ విరమణ సమీపంలో ఉన్న భార్గవ రాముడుకు జూన్‌ వరకు అవకాశం ఇవ్వాలని, అంతవరకు వేచి ఉండాలని ఓబుల్‌ కొండారెడ్డికి జిల్లాకు చెందిన ఓ ప్రజాప్రతినిధి గతంలో చెప్పినట్లు సమాచారం. ఆ మేరకు ఎస్‌ఈ పదవీ విరమణ చేస్తున్నట్లు సమాచారం.


రాష్ట్ర విభజన నేపథ్యంలో తెలంగాణ క్యాడర్‌కు కేటాయించిన  భార్గవ రాముడు ఆక్కడికి వెళ్లేందుకు ఇష్టం లేకే ఇక్కడ వీఆర్‌ఎస్‌ తీసుకుని తన సేవలకు స్వస్తి చెప్పాలనుకుంటున్నారని ఆయన సన్నిహితులు అంటున్నారు. 

Updated Date - 2020-05-30T10:02:13+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising