ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘రూ. 2.50 కోట్లతో సబ్‌స్టేషన్ల ఆధునికీకరణ’

ABN, First Publish Date - 2020-08-08T09:51:53+05:30

నంద్యాల డివిజన్‌లో కొలిమిగుండ్ల లో రెండు, సంజామల, చింతలా యిపల్లె, ఆకుమళ్ల విద్యుత్‌ సబ్‌ స్టేషన్లను రూ. 2.50 ..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 కొలిమిగుండ్ల, ఆగస్టు 7: నంద్యాల డివిజన్‌లో కొలిమిగుండ్ల లో రెండు, సంజామల, చింతలా యిపల్లె, ఆకుమళ్ల విద్యుత్‌ సబ్‌ స్టేషన్లను రూ. 2.50 కోట్లతో ఆధుని కీకరణ చేయించినట్లు ఏపీ ట్రాన్స్‌కో డీఈ నాగరాజు అన్నారు. కొలిమి గుండ్ల ఏపీ ట్రాన్స్‌కో కార్యాలయంలో ఏర్పాటు చేసిన రెండు 8 ఎంవీఏ భారీ ట్రాన్స్‌ ఫార్మర్లను డీఈ నాగరాజు, కన్‌స్ట్రక్షన్‌ డీఈ శ్రీధర్‌రెడ్డి శుక్రవారం ప్రారంభించారు.


గతంలో కొలిమిగుండ్ల విద్యుత్‌ కార్యాలయంలో రెండు 5 ఎంవీఏ ట్రాన్స్‌ఫార్మర్లు ఉండగా వాటి స్థానంలో రెండు 8 ఎంవీఏ ట్రాన్స్‌ఫార్మర్లను ఏర్పాటు చేశారు. దీంతో రైతులకు వ్యవసాయానికి సంబంధించి 9 గంటలు విద్యుత్‌ సరఫరా చేసేందుకు అవకాశం ఉంటుందని వారు తెలిపారు. రైతులకు కొత్త విద్యుత్‌ కనెక్షన్లు 2018 జనవరి నుంచి పెండింగ్‌లో ఉన్నాయని, ప్రభుత్వం నుంచి మంజూరైన వెంటనే సీని యారిటీ ప్రకారం కనెక్షన్లు మంజూరు చేస్తామని అన్నారు. కార్యక్రమంలో ట్రాన్స్‌కో ఏఈలు శ్రీనివాసులు, లైన్‌ ఇన్‌స్పెక్టర్‌ జయనాయక్‌, ఏపీ ట్రాన్స్‌కో సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - 2020-08-08T09:51:53+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising