ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నాడు-నేడు పనులను వేగవంతం చేయండి: కలెక్టర్‌

ABN, First Publish Date - 2020-11-14T05:14:21+05:30

ప్రభుత్వ పాఠశాలల్లో జరుగుతున్న నాడు-నేడు పనులను వేగవంతం చేయాలని కలెక్టర్‌ వీరపాండియన్‌ అధికారులను ఆదేశించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కర్నూలు, నవంబరు 13(ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ పాఠశాలల్లో జరుగుతున్న నాడు-నేడు పనులను వేగవంతం చేయాలని కలెక్టర్‌ వీరపాండియన్‌ అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్‌ సునయన ఆడిటోరియంలో మనబడి నాడు-నేడు పాఠశాలలో చేపడుతున్న అభివృద్ధి పనుల పురోగతిపై ఆయన అధికారులతో సమీక్షిచారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ చాలా మంది నాడు-నేడు పనులలో నిర్లక్ష్యం వహిస్తున్నారని, పద్ధతి మార్చుకోకపోతే చర్యలు తప్పవన్నారు. సమీక్షా సమావేశానికి గౌర్హాజరైన ట్రైబల్‌ వెల్ఫేర్‌ ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్‌కు నోటీసు ఇవ్వాలని సంబంధిత అధికారులకు ఆదేశించారు. అంతకుముందు జేసీ ప్రభుత్వ పాఠశాలలో చేపడుతున్న మరుగుదొడ్లు, తాగునీరు, విద్యుత్‌ వైరింగ్‌, గ్రీన్‌ బ్లాక్‌ బోర్డు, ఫర్నీచర్‌ తదితర వాటిపై మండల వారీగా సమీక్షించారు. 


పుష్కరాల్లో ఈ టికెట్‌ ద్వారా పూజలకు అనుమతి: కలెక్టర్‌ 


తుంగభద్ర పుష్కరాల్లో కొవిడ్‌-19 మార్గదర్శకాల ప్రకారం ఈ టికెట్‌ ద్వారా మాత్రమే పుష్కర ఘాట్ల వద్ద సంప్రదాయ పూజలకు, పిండ ప్రదానాలకు అనుమతి ఉంటుందని కలెక్టర్‌ వీరపాండియన్‌ తెలిపారు. శుక్రవారం కలెక్టరేట్‌లోని సునయన ఆడిటోరియంలో పుష్కర ఏర్పాట్లపై అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.  ఎస్పీ ఫక్కీరప్ప, జేసీలు రామసుందర్‌రెడ్డి, ఖాజామొహిద్దీన్‌, కమిష నర్‌ డీకే బాలాజీ, జడ్పీ సీఈవో వెంకట సుబ్బయ్య పాల్గొన్నారు.

Updated Date - 2020-11-14T05:14:21+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising