ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఇసుక కోసం నిలదీసిన గ్రామస్థులు

ABN, First Publish Date - 2020-11-24T06:14:33+05:30

మండలంలోని ఉప్పలదడియలో సోమవారం ఇసుక కోసం ఎమ్మెల్యే ఆర్ధర్‌ను గ్రామస్థులు నిలదీశారు.

ఎమ్మెల్యేను నిలదీస్తున్న గ్రామస్థులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మిడుతూరు, నవంబరు 23: మండలంలోని ఉప్పలదడియలో సోమవారం ఇసుక కోసం ఎమ్మెల్యే ఆర్ధర్‌ను గ్రామస్థులు నిలదీశారు.  గ్రామంలో  మెగా పశు వైద్య శిబిరం ప్రారంభించేందుకు వచ్చిన ఎమ్మెల్యే గ్రామ సభలో మాట్లాడుతూ  గ్రామాల్లో పాడి రైతులు ఆర్ధికంగా ఎదగడానికి ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిందని అన్నారు. ఈ సభలో కొందరు గ్రామస్థులు ఎమ్మెల్యే దగ్గరకు వచ్చి గతంలో  టాక్టరు ఇసుక రూ.2 వేలకు దొరికేదని, ప్రస్తుత ప్రభుత్వంలో టాక్టరు ఇసుక రూ. 8 వేలు అంటే కూడా ఇసుక లేదని నిర్మాణాలు ఎలా చేపట్టాలని ఎమ్మెల్యేను నిలదీశారు. దీంతో ఎమ్మెల్యే ఈ సమస్య రాష్ట్ర వ్యాప్తంగా వున్నదని, ఈ విషయాన్ని అసెంబ్లీలో ముఖ్యమంత్రి దృష్టికి తీసుకుపోయి సమస్య పరిస్కరిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో అధికారులు జేడీ  రమణయ్య, ఏడీలు రాజశేఖర్‌, మాధవి, వర ప్రసాదు, వైద్యులు శ్రీనివాస రెడ్డి, అరుణశ్రీ, నాయకులు పాల్గొన్నారు.

Updated Date - 2020-11-24T06:14:33+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising