ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నిత్యావసరాలకు గుంపులు గుంపులు

ABN, First Publish Date - 2020-03-29T09:59:48+05:30

కరోనా మహమ్మారిని అరికట్టేందుకు లాక్‌డౌన్‌ ప్రకటిస్తే కొంతమంది ప్రజలు పాటించడ లేదు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సామాజిక దూరం పాటించని జనం


కర్నూలు(ఆంధ్రజ్యోతి)/కర్నూలు(అర్బన్‌)/ఆదోని/నందికొట్కూరు, మార్చి 28: కరోనా మహమ్మారిని అరికట్టేందుకు లాక్‌డౌన్‌ ప్రకటిస్తే కొంతమంది ప్రజలు పాటించడ లేదు. సామాజిక దూరం పాటించాలని అధికారులు పదే పదే సూచిస్తున్నా ఆచరించడం లేదు. ఉదయం 6 నుంచి ఒంటి గంట వరకు నిత్యావసరాల దుకాణాలు తెరిచి ఉండటంతో ఆ సమయంలో జనం బయటకు వస్తున్నారు. కూరగాయలకు కూడా వస్తున్నారు. అయితే చాలాచోట్ల సామాజిక దూరం పాటించడం లేదు. కర్నూలులో కూరగాయల కొనుగోలు కేంద్రాలు, కిరాణ దుకాణాల వద్ద గుంపులు గుంపులుగా చేరి కొనుగోలు చేస్తున్నారు.


ఆదోని మున్సిపల్‌ మైదానంలో ఏర్పాటు చేసిన రైతుబజార్‌లో వ్యాపారులు, ప్రజలు సామాజిక దూరం పాటించడం లేదు. నందికొట్కూరు పట్టణంలో శనివారం సరుకుల కోసం వచ్చిన వారు గుమికూడటంతో దుకాణ యజమానులపై అధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సామాజిక దూరం పాటించకపోతే చర్యలు తప్పవని మున్సిపల్‌ కమిషనర్‌ అంకిరెడ్డి, ఎస్‌ఐ వెంకటరెడ్డి, వైద్యాధికారి కృష్ణమూర్తి హెచ్చరించారు. కాగా లాక్‌డౌన్‌ కొనసాగుతున్న నేపథ్యంలో రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారాయి. డోర్‌ డెలివరీ సదుపాయం ఉన్నా ప్రజలు ఎక్కువ సంఖ్యలో వినియోగించుకోలేదు. కిరాణా షాపులకే వస్తున్నారు. 


ఫోన్‌ చేస్తే ఇంటికే సరుకులు

నగరంలో నిత్యావసరాల కోసం జనం బారులు తీరుతుండడంతో అధికారులు ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టారు. ఫోన్‌ చేస్తే ఇంటికే సరుకులు వచ్చేలా ఏర్పాట్లు చేశారు. నగరంలోని రిలయన్స్‌ మార్ట్‌ (టీజీవీ మాల్‌) 8688022679, గాయత్రీ ఎస్టేట్‌ రియల్‌ మార్ట్‌ 9391422907, డీమార్టు (బళ్లారి చౌరస్తా) 970142 9692, జ్యోతి డిపార్టు మెంట్‌ స్టోర్స్‌ 8660528091, బిగ్‌ బజార్‌ (నంద్యాల చెక్‌పోస్టు) 6302381949, సెన్సర్స్‌ (ఆర్టీసీ బస్టాండ్‌) 7596039604, రిలయన్స్‌ మార్కెట్‌ (కోడుమూరు రోడ్డు) 6281704804, బెస్ట్‌ ప్రైస్‌ (వాల్‌ మార్టు) 7303591605 నెంబర్లకు ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల్లోపు ఫోన్‌ చేసి ఆర్డర్‌ ఇస్తే సరుకులు ఇంటికి తెచ్చిస్తారని కార్పొరేషన్‌ అదనపు కమిషనర్‌ రామలింగేశ్వర్‌ తెలిపారు. రూ.500 లోపు ఆర్డర్‌ అయితే డెలివరీ చార్జి వసూలు చేస్తారని, రూ.500 పైన అయితే ఎలాంటి చార్జి ఉండదని అన్నారు. ఏవైనా సమస్యలు ఎదురైతే ప్రత్యేక టోల్‌ ఫ్రీ నెం. 1800 425 9766కు కాల్‌ చేయాలని ఆయన తెలిపారు.

Updated Date - 2020-03-29T09:59:48+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising