ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గుర్తింపు కార్డులు చూపినా వెళ్లనివ్వడం లేదు

ABN, First Publish Date - 2020-03-27T10:26:17+05:30

లాక్‌డౌన్‌ నేపథ్యంలో రహదారులను దిగ్బంఽధించారు. వైద్యులు, ఆసుపత్రి సిబ్బంది, మందుల దుకాణాల నిర్వాహకులు, పెట్రోల్‌, డీజిల్‌, వంటగ్యాస్‌, మీడియా ప్రతినిథులు వారి గుర్తింపు కార్డులు చూపించి కార్యాలయాలకు వెళ్లే వెసులుబాటును అధికారులు కల్పించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆదోని: లాక్‌డౌన్‌ నేపథ్యంలో రహదారులను దిగ్బంఽధించారు. వైద్యులు, ఆసుపత్రి సిబ్బంది, మందుల దుకాణాల నిర్వాహకులు, పెట్రోల్‌, డీజిల్‌, వంటగ్యాస్‌, మీడియా ప్రతినిథులు వారి గుర్తింపు కార్డులు చూపించి కార్యాలయాలకు వెళ్లే వెసులుబాటును అధికారులు కల్పించారు. అయితే కొందరు పోలీసులు   అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారు. గుర్తింపు కార్డులు చూపించినా ముందుకు వెళ్లనివ్వడం లేదు. రహదారికి అడ్డంగా ఉంచిన బారికేడ్లను తీయడం లేదు. ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలని సూచిస్తున్నారు. ఆ మార్గాల్లో వెళితే ఏ అడ్డంకి లేకుండా చేరుకుంటామన్న గ్యారంటీ లేదు. చిన్న చిన్న వీధుల గుండా వెళ్తే కుక్కల బెడద ఉంటుంది. కొన్ని చోట్ల రోడ్లకు అడ్డంగా బారికేడ్లు ఉంచి ఎవ్వరిని నియమించలేదు. అత్యవసరంగా ఆసుపత్రికి వెళ్లాల్సి వస్తే బారికేడ్లను తప్పించడానికి నానావస్థలు పడుతున్నారు. అత్యవసర పనుల మీద వెళ్లే వారిని అనుమతించాలని ప్రజలు కోరుతున్నారు. 

Updated Date - 2020-03-27T10:26:17+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising