ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రైతు బజార్లలో రద్దీ

ABN, First Publish Date - 2020-03-27T10:14:59+05:30

లాక్‌ డౌన్‌ ఉన్నా, నిత్యావసరాల కొనుగోలుకు వెసులుబాటు కల్పించారు. కుటుంబానికి ఒకరు చొప్పున మార్కెట్‌ వెళ్లేందుకు అనుమతిస్తున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సామాజిక దూరంపై నిర్లక్ష్యం

నియంత్రణకు పోలీసుల తంటాలు


కర్నూలు, మార్చి 26(ఆంధ్రజ్యోతి): లాక్‌ డౌన్‌ ఉన్నా, నిత్యావసరాల కొనుగోలుకు వెసులుబాటు కల్పించారు. కుటుంబానికి ఒకరు చొప్పున మార్కెట్‌ వెళ్లేందుకు అనుమతిస్తున్నారు. దుకాణాల వద్ద సామాజిక దూరం పాటించాలని అధికారులు పదే పదే చెబుతు న్నారు. అందుకు వీలుగా దుకాణాల ముందు బాక్సులను గీయిం చారు. కానీ నగర ప్రజలు పలువురు పాటించడం లేదు. గుంపులుగా ఎగబడి సరుకులు కొంటున్నారు. వారిని నియంత్రించడం పోలీసు లకు కష్టసాధ్యంగా మారింది. ఉగాది పండుగ మరుసటి రోజున జిల్లా వాసులు కర్రీ పండుగ జరుపుకుంటారు. దీంతో మాంసం, కూరగాయలు కొనేందుకు గురువారం ఉదయం 6 నుంచి మఽధాహ్నం ఒంటి గంట వరకు ఒక్కొరు బయటకు రావచ్చని అధికారులు సూచించారు. కానీ భారీ సంఖ్యలో బయటకు వచ్చారు. తొందరగా వెళ్ళకపోతే కూరగాయలు, మాంసం దొరకవన్న అపోహతో రైతు బజార్లు, మాంసం దుకాణాలకు పరుగులు పెట్టారు. సామాజిక దూరం గురించి పట్టించుకోలేదు. 


సీ క్యాంపు రైతు బజర్‌లో దుకాణాల మధ్య మీటరు దూరం ఉండేలా బాక్సులు ఏర్పాటు చేశారు. క్యూ లైన్‌ పాటించాలని అధికారులు సూచించినా జనం పట్టించుకోలేదు. కొత్తపేట రైతు బజారు అధికారులు ఒక్కోసారి 10 మందిని మాత్రమే లోపలికి అనుమతించారు. వారు బయటకు వచ్చాకే మరో పది మందిని పంపించారు. వెంకటరమణ కాలనీలోని అబ్బాస్‌ నగర్‌ రైతు బజారులో మీటరు దూరం పాటించారు. అక్కడ వినియోగదారులు చేతులు శుభ్రం చేసుకునేందుకు సబ్బు ఏర్పాటు చేశారు. బస్టాండ్‌ సెంటర్‌లోని మార్కెట్‌ యార్డులో రాకపోకలకు ఒకే గేటు మాత్రమే ఉండడంతో జనం ఇబ్బందులు పడ్డారు. బళ్ళారి చౌరస్తా ద్వారా ఒకరికి మించి రానివ్వకుండా పోలీసులు కట్టుదిట్టం చేశారు. కానీ మార్కెట్‌ దగ్గర వందలాదిగా గుమిగూడారు. దీంతో నియంత్రణ సాధ్యంగాక అధికారులు, పోలీసులు తంటాలు పడ్డారు. మార్కెట్లోకి లైసెన్స్‌ లేని వ్యాపారులు కూడా రావడంతో క్రమం తప్పింది. శుక్రవారం నుంచి  లైసెన్స్‌డ్‌ వ్యాపారులను మాత్రమే అనుమతిస్తామని, తద్వారా సామాజిక దూరం పాటించడంలో సమస్యలు లేకుండా చూస్తామని అధికారులు తెలిపారు.


కనిపించని ధరల పట్టిక 

కిరాణం దుకాణాల వద్ద ధరల పట్టిక ఏర్పాటు చేయాలని, సరుకులను ఎక్కువ ధరలకు అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరి స్తున్నారు. కానీ, నగరంలో  చాలా మంది వ్యాపారులు నిబంధనలు పాటించడం లేదు. దుకాణాల వద్ద ధరల పట్టికను ఏర్పాటు చేయలేదు. మార్కెట్‌ యార్డు కిరాణం దుకాణాల్లో నిత్యావసర సరుకులను ఎక్కువ ధరలకు అమ్ముతున్నారని వినియోగదారులు వాపోతున్నారు. ఏ వస్తువు ఎంత అనే రేటు వేయకుండా బిల్లు ఇస్తున్నారని, ధరలు తెలియడం లేదని వాపోతున్నారు.  


పల్లె జనం భేష్‌ 

పట్టణం, నగరాల్లో కొనుగోలు దారులు పద్ధతి పాటించడం లేదు. కానీ గ్రామీణ ప్రజలు క్రమశిక్షణగా మెలుగుతున్నారు. దుకాణాల వద్ద సామాజిక దూరాన్ని పాటించి స్ఫూర్తి కలిగిస్తున్నారు. కొలిమిగుండ్ల కూరగాయల మార్కెట్లలో అధికారుల సూచనలను జనం పాటిస్తున్నారు. దూరంగా నిలబడి నిత్యావసరాలు కొనుగోలు చేస్తున్నారు. మిడుతూరులో మెడికల్‌ షాపుల మందు సామాజిక దూరం పాటించేలా ఏర్పాటు చేసిన బాక్స్‌లో నిలబడి ఔషధాలను కొనుగోలు చేస్తున్నారు. 


Updated Date - 2020-03-27T10:14:59+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising