ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కరోనాను ధైర్యంగా ఎదుర్కొందాం: మంత్రి

ABN, First Publish Date - 2020-04-10T05:47:33+05:30

కరోనా వైరస్‌ వ్యాప్తి చెందకుండా అందరం కలిసి కట్టుగా ఎదుర్కొందామని రాష్ట్ర ఆర్థిక శాఖామంత్రి బుగ్గన రాజారెడ్డి అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

డోన్‌, ఏప్రిల్‌ 9: కరోనా వైరస్‌ వ్యాప్తి చెందకుండా అందరం కలిసి కట్టుగా ఎదుర్కొందామని రాష్ట్ర ఆర్థిక శాఖామంత్రి బుగ్గన రాజారెడ్డి అన్నారు. గురువారం డోన్‌ పట్టణంలో మంత్రి పర్యటించారు. అనంతరం స్థానిక మున్పిపల్‌ కార్యాలయ అవరణలో ఆయన వివిధ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. పట్టణంలో పాజిటివ్‌ కేసుకు సంబందించిన వివరాలను మంత్రి అధికారులను అడిగి తెలుసుకున్నారు. ప్రైమరీ కాంటాక్ట్సుకు సంబందించి సేకరించిన వివరాలు అడిగి తెలుసుకున్నారు.


కాంటాక్ట్సు ఉన్న వారిని హోమ్‌ క్వారంటైన్‌లో ఉండేలా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని మంత్రి సూచించారు. అదేవిధంగా ప్రభుత్వాసుపత్రిలో, ఐసొలేషన్‌ వార్డులో శానిటేషన్‌ గురించి అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వాసుపత్రిలో అపరిశుభ్రంగా ఉండటంపై ఆసుపత్రి సూపరింటెండెంట్‌పై మంత్రి తీవ్రం అసంతృప్తిని వ్యక్తం చేశారు. పరిశుభ్రంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అదేవిధంగా ప్రభుత్వాసుపత్రిలో ఇన్సిర్‌ నేటర్‌ లేదని తన దృష్టికి ఎందుకు తీసుకరాలేదని ఆసుపత్రి సూపరింటెండెంట్‌ను ప్రశ్నించారు. ఇన్సిర్‌నేటర్‌ను ఆసుపత్రికి పంపించేలా చర్యలు తీసుకుంటానన్నారు.


ర్యాపిడ్‌ టెస్ట్‌ పరికరాలతో గంటలోపే కరోనాను నిర్ధాచేలా తమ ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. లాక్‌డౌన్‌ నిబంధనలను పాటించి కరోనా వ్యాప్తి నియంత్రణకు ప్రజలు సహకారాలు అందించాలని ఆయన కోరారు. ఈ సమావేశంలో మాజీ జడ్పీటీసీ శ్రీరాములు, డీఎస్పీ నరసింహారెడ్డి, మున్సిపల్‌ కమిషనర్‌ కేఎల్‌ఎన్‌రెడ్డి, తహసీల్దార్‌ నరేంద్రనాథ్‌రెడ్డి, ఎంపీడీవో శ్రీనివాసులు, సీఐ సుబ్రహ్మణ్యం, డాక్టర్‌ బాలచంద్రారెడ్డి, మండల మెడికల్‌ ఆఫీసర్‌ పాల్గొన్నారు. 

Updated Date - 2020-04-10T05:47:33+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising